నాని-క్రికెట్టూ.. కిట్టూ

హీరో నాని ఎంట్రీ లెవెల్ సినిమా 'భీమిలి కబడ్డీ జట్టు' ఆ సినిమాలో అచ్చమైన కబడ్డీ ప్లేయర్ గా కనిపించడమే కాదు. జీవించినట్లు నటించాడు కూడా. కచ్చితంగా నాని సినిమాల్లో ఆ సినిమాది ఓ…

హీరో నాని ఎంట్రీ లెవెల్ సినిమా 'భీమిలి కబడ్డీ జట్టు' ఆ సినిమాలో అచ్చమైన కబడ్డీ ప్లేయర్ గా కనిపించడమే కాదు. జీవించినట్లు నటించాడు కూడా. కచ్చితంగా నాని సినిమాల్లో ఆ సినిమాది ఓ మంచి ప్లేస్. మళ్లీ ఇన్నాళ్ల తరువాత క్రీడల నేపథ్యంలో నాని సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా టైటిల్ ఇతరత్రా వ్యవహారాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు లుక్ కూడా వచ్చింది.

క్రికెట్ నేపథ్యంలో తయారవుతున్న జెర్సీ సినిమా లుక్ లో నాని మరీ వైవిధ్యంగా కాదు కానీ, కాస్త డిఫరెంట్ గానే వున్నాడు. ఓ సీరియస్ క్రికెటర్ లుక్స్ మాదిరిగా కాస్త రఫ్ గా, కాస్త పెరిగిన జుట్టు, గెడ్డంతో నాని ఈ లుక్ లో కనిపించాడు. సాధారణంగా క్రికెట్ గ్రవుండ్స్ లో కనిపించే సీన్ తో ఫస్ట్ లుక్ వదిలారు.

మళ్లిరావా సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమిళ సంగీత సంచలనం అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

న్యూ ఇయర్ స్పెషల్ చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేంద్రంలో పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎటువైపు