ఏ సినిమా చేయాలి? ఎప్పుడు చేయాలి? అన్న మీమాంస హీరో నాగార్జునను ఇంకా వీడడంలేదు. విజయం వరిస్తే ఊపు ఒకలా వుంటుంది. పరాజయం పలకరిస్తే పరిస్థితి ఇంకోలా వుంటుంది.
రెండు సబ్జెక్ట్ లు ఓకె చేసాడు నాగార్జున.
ఒకటి… చి.ల.సౌ సినిమా అందించిన రాహుల్ రవీంద్రన్ చెప్పిన మన్మధుడు టైపు స్క్రిప్ట్.
రెండు… సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సీక్వెల్ బంగార్రాజు. దీనికి కళ్యాణ్ కృష్ణ డైరక్టర్.
ఆ మధ్య ముందుగా రాహుల్ రవీంద్రన్ సినిమా తరువాత బంగార్రాజు అని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కొద్దిరోజుల క్రితం కళ్యాణ్ కృష్ణ చేసే సినిమానే ముందు, దాంట్లో చైతన్య కూడా వుంటాడు అని వినిపించింది.
లేటెస్ట్ సంగతి ఏమిటంటే, ఫిబ్రవరిలో రాహుల్ రవీంద్రన్ తో చేసే సినిమా స్టార్ట్ చేసిది అది చిన్న సినిమాగా వుంటుంది కాబట్టి, మే నాటికి తన వర్క్ ఫినిష్ చేసి, కళ్యాణ్ కృష్ణ సినిమాను ప్రారంభించాలని నాగ్ డిసైడ్ అయ్యారన్నది.
బంగార్రాజు (సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్) కాస్త పెద్ద సినిమాగా వుంటుందని అందుకని దాన్ని మేలో మొదలుపెట్టి దసరాకు టార్గెట్ గా రావాలని, ఈ లోగా రాహుల్ రవీంద్రన్ సినిమాను పోస్ట్ సమ్మర్ కు రెడీ చేయాలని నాగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఇదీ ప్లాన్. దీని మీదే వుంటారా? మళ్లీ మారుతారా? అన్నది వెయిట్ అండ్ సీ.