కిరణ్ అబ్బవరం..వీలయినంత వరకు వైవిధ్యమైన సబ్జెక్ట్ లు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న హీరో. అతగాడి లేటెస్ట్ సినిమా సమ్మతమే.
జీవితంలో పెళ్లే గోల్ అనుకునే కుర్రాడు ప్రేమలో పీకల్లోతు మునిగి తేలిన తరువాత అది కాస్తే బ్రేకప్ అయితే అన్న పాయింట్ చుట్టూ తిరిగే సినిమాగా కనిపిస్తోంది సమ్మతమే. ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. చాందిని చౌదరి..కిరణ్ అబ్బవరం చుట్టూనే మొత్తం ట్రయిలర్ తిరిగింది.
ట్రయిలర్ మూడు వంతులు హీరో హీరోయిన్ల లవ్, రొమాన్స్ చుట్టూనే తిప్పారు. లైట్ గా ఫన్ టచ్ ఇచ్చారు. ట్రయిలర్ నీట్ గా, స్మూత్ గా బాగానే వెళ్లింది. చివర్న ఎమోషనల్ టచ్ కూడా బాగుంది.
అంతా ఓకె. కానీ సాధారణంగా యంగ్ హీరోల సినిమాలు కాస్త ఎక్స్ ట్రా ప్లస్ జోష్ తో వుండాలి. కానీ కిరణ్ అబ్బవరం ఫన్ తో పాటు మిగిలిన స్టఫ్ కూడా చాలా సబ్టిల్ గా వుండేలా చూస్తున్నారు. కానీ కుర్రకారుకు ఈ జోష్ సరిపోతుందా అన్నది చూసుకోవాలి.
ఆ సంగతి పక్కన పెడితే ట్రయిలర్ ప్రామిసింగ్ గానే వుంది. విజువల్స్ బాగున్నాయి. డైరక్టర్ గొపీనాధ్ రెడ్డి తన స్టయిల్ నెరేషన్ లో సమ్మతమే సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.