ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో మూవీ రాబోతోందనే విషయం అందరికీ తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కూడా కన్ ఫర్మ్ చేసిన విషయం ఇది. ఇప్పుడీ సబ్జెక్ట్ పై మారుతి కూడా మాట్లాడాడు. ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడో బయటపెట్టాడు
“ప్రభాస్ ను కలిశాను. స్టోరీ డిస్కషన్లు నడుస్తున్నాయి. ప్రభాస్ తో ఓ మంచి ఎంటర్ టైనర్ తీయాలి. డార్లింగ్, బుజ్జిగాడు సినిమాల టైపులో యాక్టివ్ ప్రభాస్ ను చూపించాలనేది నా కోరిక. ప్రభాస్ ను ప్రేమించే వ్యక్తిగా ఆయన్ను అలాంటి చలాకీ రోల్ లో చూడాలనేది నా కోరిక. ఆ ఆలోచనతోనే ప్రభాస్ ను కలిశాను. మిగతా డీటెయిల్స్ త్వరలోనే చెబుతాను.”
ఇలా ప్రభాస్ తో చేయబోయే సినిమాకు సంబంధించి తన ఆలోచనల్ని బయటపెట్టాడు డైరక్టర్ మారుతి. ప్రభాస్ గురించి వ్యక్తిగతంగా తనకు తెలుసని, అతడి ఫ్యాన్స్ గురించి మరింత బాగా తెలుసని, అందర్నీ తృప్తి పరిచే విధంగానే సినిమా ఉంటుందని అంటున్నాడు.
“ప్రభాస్ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేయను. ప్రభాస్ కు నేను పెద్ద ఫ్యాన్ ని. వ్యక్తిగతంగా ఆయనేంటో నాకు తెలుసు. ప్రభాస్ నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో నాకు తెలుసు. ఆయన స్థాయిలోనే సినిమా ఉంటుంది.”
తీసే ప్రతి సినిమాను డిస్ట్రిబ్యూటర్ ను దృష్టిలో పెట్టుకొని తీస్తానని, ఒక్కరు కూడా నష్టపోకూడదనే కోణంలో ఆలోచిస్తానని.. అలాంటిది ప్రభాస్ తో సినిమా చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటానని అంటున్నాడు మారుతి. ఇతడు డైరక్ట్ చేసిన పక్కా కమర్షియల్ సినిమా జులై 1న థియేటర్లలోకి వస్తోంది. టైటిల్ కు తగ్గట్టు ఇది పక్కా కమర్షియల్ సినిమా అని, ప్రేక్షకుడు ఊహించినట్టుగానే ఉంటూ వాళ్లు మెస్మరైజ్ అయ్యేలా ఉంటుందని చెబుతున్నాడు.