బయోపిక్ పై తమ్ముళ్ల భయం?

అందరూ ఒకలా ఆలోచిస్తే మరి కొందరు వేరేలా ఆలోచిస్తుంటారు. ఎన్టీఆర్ బయోపిక్ మరోసారి ఎన్టీఆర్ ను జనాలకు గుర్తుచేసి, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో అంతో ఇంతో మేలు చేస్తుందని కొంత…

అందరూ ఒకలా ఆలోచిస్తే మరి కొందరు వేరేలా ఆలోచిస్తుంటారు. ఎన్టీఆర్ బయోపిక్ మరోసారి ఎన్టీఆర్ ను జనాలకు గుర్తుచేసి, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో అంతో ఇంతో మేలు చేస్తుందని కొంత భావన పబ్లిక్ లో వుంది. అయితే అదే సమయంలో తెలుగుతమ్ముళ్లలో ఓ వర్గం వేరే విధంగా ఆందోళన చెందుతోంది. ఓపెన్ గా కాకపోయినా, తమ్మళ్లలో తమ్ముళ్లు ఈ విషయంలో గుసగుస లాడుకుంటున్నారు.

ఫస్ట్ పార్ట్ మొత్తం ఎన్టీఆర్ ను ధీరోదాత్తుడిగా చూపిస్తారు. అట్టడుగు నుంచి అత్యన్నత స్థాయికి చేరుకుని అద్భుత నటుడిగా చూపిస్తారు. సహజంగానే జనాలకు ఎన్టీఆర్ మీద అభిమానం వస్తుంది. అదే టైమ్ లో చివరి క్షణాల్లో ఎన్టీఆర్ అనుభవించిన బాధలు, కన్నబిడ్డలు, అయిన వాళ్లు ఎవరూ లేని దాదాపు అనాధమరణం అన్నవి గుర్తుకు వస్తాయి.

దీనికి కారణమైన చంద్రబాబు నాయుడు కూడా గుర్తుకు వస్తారు. దాంతో అతని మీద ఏమైనా నెగిటివ్ ఫీల్ జనాల్లో కలుగుతుందేమో? అన్న అనుమానం తమ్మళ్లలో కలుగుతోంది. నిజానికి రెండో భాగంలో చంద్రబాబు పాత్రనే హీరో. నాదెండ్ల ఉదంతంలో ఎలా చక్రం తిప్పిందీ? లక్ష్మీ పార్వతి కారణంగా పార్టీ పక్కదారుల్లోకి పోతుంటే ఎలా కాపాడింది అన్నీ వుంటాయి.

కానీ ఆ భాగం వచ్చేది మలిభాగం వచ్చిన నాలుగు వారాల తరువాతే. కానీ ఈలోగా జనాల్లో జరగాల్సిన డ్యామేజీ జరుగుతుందన్న భయం కూడా తమ్ముళ్లలో వినిపిస్తోంది. అదే విధంగా పొరపాటున ఎన్నికల కోడ్ అనుకోకుండా ముందుకు వస్తే, రెండోభాగం విడుదల ఎన్నికల అనంతరానికి వాయిదా పడుతుందేమో? అప్పుడు బాబుగారి వెర్షన్ జనాలకు చేరదేమో అన్న భయం కూడా వినిపిస్తోంది. 

సినిమా ఆడియన్స్‌ని హడలెత్తించిన డిజాస్టర్లు! స్పెషల్ 2018 ఈవారం పేపర్

మోడీ ఎదుగుదలను RSS కట్ చేస్తోందా?