నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ. రెండేళ్లుగా అతగాడి సినిమా ఎంట్రీ వార్తల్లో వినిపిస్తోంది కానీ వాస్తవంలో కనిపించడంలేదు. దీనికి కారణాలుగా అనే గుసగుసలు వినిపిస్తూనే వున్నాయి. మోక్షజ్ఞ విపరీతంగా ఒళ్లు చేయడం అన్నది వాటిల్లో ఒకటి. ఈ కారణంగానే బయోపిక్ లో మోక్షజ్ఞ కనిపించడం కూడా సాధ్యం కాలేదన్నది ఇన్ సైడ్ వర్గాల కథనం.
అయితే ఇటీవల కొంతకాలంగా మోక్షజ్ఞ వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. తెరమీదకు రావాలన్న కోరిక అతనిలో బలంగా పెరిగినట్లు వినిపిస్తోంది. 2019లో ఎలాగైనా సినిమా చేస్తాను అని మోక్షజ్ఞ సన్నిహితులతో అంటున్నట్లు తెలుస్తోంది.
ఈ టార్గెట్ లో భాగంగా ఒళ్లు తగ్గేపని షురూ చేసాడట. ఇప్పటికి సగంవరకు తగ్గాడని నిన్నటి నిన్న ప్రసాద్ ల్యాబ్ లో తల్లి వసుంధర, తండ్రి బాలకృష్ణలతో కేజీఎఫ్ సినిమా చూడడానికి వచ్చినపుడు మోక్షజ్ఞను చూసిన వారు చెబుతున్నాయి.
అయితే ఇది సరిపోదని, ఇంకా చాలా తగ్గాలని కూడా అంటున్నారు. గతంలో కన్నా బెటర్ అని, అయితే హీరోగా తెరపై కనిపించాలంటే ఇంకా చాలా తగ్గాలని అంటున్నారు.
సినిమా ఆడియన్స్‌ని హడలెత్తించిన డిజాస్టర్లు! స్పెషల్ 2018 ఈవారం పేపర్