యువి ‘వినయ’ సేఫేనా?

బోయపాటి-రామ్ చరణ్ కాంబో సినిమా వినయ విధేయరామ. ఈ సినిమాకు ఆ కాంబినేషన్ నే పెద్ద ప్లస్. అందుకే ఈ సినిమాను రామ్ చరణ్ క్లాస్ మేట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ యువి సంస్థ…

బోయపాటి-రామ్ చరణ్ కాంబో సినిమా వినయ విధేయరామ. ఈ సినిమాకు ఆ కాంబినేషన్ నే పెద్ద ప్లస్. అందుకే ఈ సినిమాను రామ్ చరణ్ క్లాస్ మేట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ యువి సంస్థ విక్రమ్ 72 కోట్లకు కొనుగోలు చేసారు. ఇప్పుడు ఇందులో నిర్మాత దిల్ రాజు కూడా జాయిన్ అయ్యారు. నైజాం, వైజాగ్ ఏరియాలు రెండూ కలిపి భారీరేటుకు ఆయన ఫిక్స్ చేసి, అందులో యాభైశాతం వాటాను తీసుకున్నారు. 

నైజాం, వైజాగ్ ఏరియాల హక్కుల్లో సగం వాటా కోసం దిల్ రాజు 14 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈస్ట్ ను 6.40 కోట్లకు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. టోటల్ గా ఆంధ్ర సీడెడ్ నైజాం కలిపి 72 కోట్ల రేంజ్ లోనే మార్కెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యువి తన డిస్ట్రిబ్యూషన్ వున్న ఏరియాలను అమ్మడంలేదు. ఇప్పటికి సగం వరకు రికవరీ వచ్చినట్లు తెలుస్తోంది.

మిగిలిన సగం భారం యువి మీద వుంటుంది. ఇప్పటివరకు సినిమాకు వచ్చిన బజ్ ఏదయితే వుంది అది కేవలం కాంబినేషన్ కారణంగా వచ్చిందే. సినిమాకు పబ్లిసిటీ విషయంలో మాత్రం ఇంకా వీక్ గానే వుంది వ్వవహారం. స్టిల్స్ అన్నీ సకాలంలో వదలకపోవడం, పైగా అవి లీక్ అయ్యాక, సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాక విడుదల చేయడం అన్నది అభిమానుల కోపానికి కారణం అవుతోంది. 

అడియో, ట్రయిలర్ వీక్ గా వున్న సినిమాకు బజ్ మాత్రం వుండడం వల్ల యువి ఈ బెట్ లో సేఫ్ అయ్యేలాగే కనిపిస్తోంది.

సినిమా ఆడియన్స్‌ని హడలెత్తించిన డిజాస్టర్లు! స్పెషల్ 2018 ఈవారం పేపర్

మోడీ ఎదుగుదలను RSS కట్ చేస్తోందా?