గుడ్ న్యూస్.. కరోనా రోగి కోలుకున్నాడు

తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసుగా నిర్థారింపబడి, అందర్నీ టెన్షన్ కు గురిచేసిన 24 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు కోలుకున్నాడు. అతడిప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, టెస్టుల్లో కూడా నెగెటివ్ వచ్చిందని వైద్యులు ప్రకటించారు.…

తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసుగా నిర్థారింపబడి, అందర్నీ టెన్షన్ కు గురిచేసిన 24 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు కోలుకున్నాడు. అతడిప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, టెస్టుల్లో కూడా నెగెటివ్ వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ఎందుకైనా మంచిదని, మరోసారి అతడి శాంపిల్స్ ను పూణెకు పంపించారు. రెండోసారి కూడా నెగెటివ్ వచ్చిందని నిర్థారించుకున్న తర్వాత అతడ్ని హాస్పిటల్ నుంచి ఇంటికి పంపిస్తారు.

రోగి పూర్తిగా కోలుకున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తన చర్యలు కొనసాగిస్తూనే ఉంది. శంషాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి దిగిన ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. అలా ఇప్పటివరకు 41,100 మందికి స్క్రీనింగ్ నిర్వహించింది. నిన్న ఒక్కరోజే 3517 మందికి స్క్రీనింగ్ టెస్ట్ చేశారు.

మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లా హాస్పిటల్స్ లో ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని గాంధీ, ఫీవర్ హాస్పిటల్స్ లో 261 మంది కరోనా అనుమానితులున్నారు. వీళ్లలో 230 మందికి రిపోర్ట్ నెగిటివ్ వచ్చినప్పటికీ, అబ్జర్వేషన్ లో ఉంచారు.

ఇక భారత్ లో కరోనా కేసుల సంఖ్య 46కు చేరింది. కేరళలో మరో ఆరుగురికి, కర్నాటకలో నలుగురికి వైరస్ సోకినట్టు కేంద్రం ప్రకటించింది. బెంగళూరులో ఓ వ్యక్తికి కరోనా వచ్చిందని ఆ రాష్ట్ర మంత్రి ప్రకటించారు. నగరంలో స్కూల్స్ అన్నీ మూసేస్తూ ఆదేశాలు జారీచేశారు. అటు భారత ప్రభుత్వం మయన్మార్ బోర్డను పూర్తిగా మూసేసింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 113 దేశాలకు కరోనా వ్యాపించింది. ఇప్పటివరకు అధికారికంగా 4009 మంది మరణించారు. నిన్న ఒక్క రోజే ఇటలీలో 97 మంది, ఇరాన్ లో 43 మంది  కరోనా వల్ల చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా లక్షా 14వేల 285 మంది కరోనా బాధితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

మాట, గౌరవం రెండూ నిలబెట్టుకున్న జగన్

ఆ పందుల గురించి అలోచించి నా టైమ్ వేస్ట్ చేసుకోను