హోలి సందర్భంగా హీరోహీరోయిన్లంతా తమకు తోచిన విధంగా రంగుల పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. హీరో ఎన్టీఆర్ అయితే ఈరోజు పొద్దున్నే హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్న తన ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టాడు. ఇక రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ తనకు బాగా అలవాటైన పద్ధతిలో హోలిని జరుపుకుంది.
సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ భామ, హోలీ కలర్స్ తో ఓ హాట్ ఫొటోను పోస్ట్ చేసి కుర్రాళ్లను పిచ్చెక్కించింది. హ్యాపీ హోలీ అంటూ పోస్ట్ చేసింది. సందర్భం ఏదైనా ఇలా హాట్ ఫొటోలతో రెచ్చిపోవడం కేతికకు వెన్నతో పెట్టిన విద్య. ఆమెకు పూరి సినిమాలో అవకాశం తెచ్చిపెట్టింది కూడా ఇదే.
మినిమం గ్యాప్ లో హాట్ ఫొటోలు పెడుతూ సోషల్ మీడియాలో 10లక్షలకు పైగా ఫాలోవర్స్ ను పొందింది కేతిక శర్మ. ఇప్పుడు హోలీకి కూడా తన ఫాలోవర్స్ ను ఏమాత్రం నిరాశపర్చకుండా, ఇలా హాట్ గా వచ్చేసింది. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ, ప్రస్తుతం ఆకాష్ పూరితో కలిసి రొమాంటిక్ అనే సినిమా చేస్తోంది.