దండెత్తి వస్తున్న కేంద్ర మంత్రులు

అంతా కలసి వస్తున్నారు. వరసబెట్టి వస్తున్నారు. అలా విశాఖను చుట్టేస్తున్నారు. ఒక కేంద్ర మంత్రి ఇలా వచ్చి అలా వెళ్లగానే మరొకరు వస్తున్నారు. ఇదంతా కేవలం వారం పది రోజుల వ్యవధిలోనే జరుగుతోంది.  Advertisement విశాఖలో…

అంతా కలసి వస్తున్నారు. వరసబెట్టి వస్తున్నారు. అలా విశాఖను చుట్టేస్తున్నారు. ఒక కేంద్ర మంత్రి ఇలా వచ్చి అలా వెళ్లగానే మరొకరు వస్తున్నారు. ఇదంతా కేవలం వారం పది రోజుల వ్యవధిలోనే జరుగుతోంది. 

విశాఖలో ప్రస్తుతం కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ టూర్ చేస్తున్నారు. ఆయన ఏకంగా ఏజెన్సీలో మెరిశారు. అక్కడ మన్యం ప్రజల కుల దేవత మోదకొండమ్మ అమ్మవారి సన్నిధిలో మొక్కులు తీర్చుకున్నారు. కాఫీ తోటలలో కలియతిరిగారు. గిరిజనులను పలకరిస్తూ కేంద్రం వారికి అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఐటీడీయే అధికారులతో కూడా భేటీ అయ్యారు.

ఆయనకు ముందు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీ విశాఖలో రెండు రోజుల పాటు టూర్ చేశారు. ఇక ఆయనకు ముందు కేంద్ర మహిళా స్త్రీ శిసు సంక్షేమ శాఖ శహాయ మంత్రి మహేంద్ర భాయి విశాఖలో మహిళా సదస్సుని ప్రారంభించి వెళ్లారు. ఇక తాజాగా చూస్తే కేంద్ర సహాయమంత్రి నారాయణస్వామి కూడా ఒడిషా వెళ్తూ విశాఖలో హాల్ట్ చేశారు. వీరే కాదు ఇంకా మరింతమంది కేంద్ర మంత్రులు వస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంతమంది కేంద్ర మంత్రులు ఎందుకు వస్తున్నారు అంటే ఎనిమిదేళ్ళ  మోడీ పాలన గురించి నాలుగు మంచి మాటలు జనాలకు చెప్పడం ద్వారా బీజేపీని పటిష్టం చేయడం కోసమట. ఇలా కట్టకట్టుకుని టూర్లు చేస్తే కాషాయం వైపు జనాలు కదులుతారా. 

కేంద్రం ఏపీకి ఏదైనా గట్టి మేలు చేస్తే ఆటోమేటిక్ గా ఆ పార్టీ వైపు చూస్తారని అంతా అంటున్న మాట. కానీ కేంద్ర మంత్రులు మాత్రం ఏపీకి అంతా చేశాం, ఇక చేయాల్సింది లేదు అనేలా మీడియా ముందు ప్రకటిస్తూ ముందుకు సాగిపోతున్నారు.