విశాఖ మినీ ఇండియాగా చెబుతారు. విశాఖలో ఒక్క తెలుగు వారే లేరు. అన్ని రాష్ట్రాలకు చెందిన వారు నివసిస్తూంటారు. విశాఖలో ఎక్కువగా ఉత్తరాదివారు ఉంటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు విశాఖలో అధికంగా ఉన్నాయి. దాంతో విశాఖలో లోకల్ అన్న పదం తక్కువగా వినిపిస్తుంది.
ఎక్కడ నుంచో ఉద్యోగ వ్యాపారం నిమిత్తం విశాఖ వచ్చి స్థిరపడిన వారు ఉన్నారు. వారు రాజకీయంగా రాణిస్తున్న సందర్భాలు ఉన్నాయి. విశాఖకు రాజధాని కళ ఉందని అందుకే వైసీపీ అంటోంది. ఇది నాది నాకే సొంతం అంటే ఏ నగరమూ ఎదగదు. అందరికీ ఆహ్వానం పలికితేనే ఆ నగరం విశ్వవ్యాప్తం అవుతుంది.
అలాంటి భావన విశాఖలో ఉంది. ఈ సిటీ నాది అని అంతా అనుకుంటారు. అందుకే విశాఖను పాలనా రాజధానిగా చేయాలని వైసీపీ పట్టుదలగా ఉంది. విశాఖలో ఒక వినూత్న కార్యక్రమం జరిగింది. విశాఖ వన్ ఇండియా పేరిట జరిగిన ఈ కార్యకమంలో పాల్గొన్న ఉత్తరాంధ్రా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సౌత్ ముంబై సిటీ విశాఖ అని ఆయన కొనియాడారు. అన్ని వర్గాలను ఆదరించే మహా నగరం అని కొనియాడారు. విశాఖ అభివృద్ధిలో అన్ని ప్రాంతాల భాగస్వామ్యం ఉందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాఖ రాజధాని కాగల అర్హత ఉన్న నగరమని ఆయన అన్నారు.
కొన్ని న్యాయపరమైన అవరోధాల మూలంగానే విశాఖకు రాజధాని రావడం ఆలస్యం అవుతోంది అని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో మూడు నెలలలో విశాఖలో మకాం మార్చుకుని ఇక్కడ నుంచే పాలిస్తారు అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
విశాఖ రాజధాని అవడం ఖయమని ఆయన నొక్కి చెప్పారు. విశాఖలో సంకుచితత్వం లేదని అది అందరిదీ అని వైసీపీ చేస్తున్న కొత్త వాదన విపక్షాలకు షాకింగ్ ట్రీట్మెంట్ వంటిదే అని అంటున్నారు. విశాఖ రాజధాని అవడం ఎవరికీ ఇష్టం లేదు అని విపక్షాలు అంటున్నాయి. అయితే విశాఖ అభివృద్ధిలో ఇతర రాష్ట్రాల భాగస్వామ్యం కూడా ఉందని విశాఖ విశ్వనగరం అని వైసీపీ అభివర్ణిస్తోంది.