గోవా బ్యూటీ ఇలియానా గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ హీరోయిన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది.
5 రోజుల కిందటే ఇలియానా బిడ్డకు జన్మనిచ్చింది. ఆగస్ట్ 1న తనకు మగ బిడ్డ పుట్టినట్టు ఆమె ప్రకటించింది. అంతేకాదు, బాబుకు పేరు కూడా పెట్టింది. ఇలియానా కొడుకు పేరు “కో ఫొనిక్స్ డోలన్”.
ఈ ప్రపంచంలోకి తమ బిడ్డను ఆహ్వానించినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో వర్ణించలేనని పేర్కొంది ఇలియానా. తమ మనసులు సంతోషంతో నిండిపోయాయని ప్రకటించింది.
తన గర్భానికి సంబంధించి ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచింది ఇలియానా. తను గర్బం దాల్చిన విషయాన్ని ప్రకటించిన ఈ హీరోయిన్, బిడ్డ తండ్రి ఎవరనేది చెప్పలేదు. ఆ తర్వాత దశలవారీగా తన ప్రియుడు ఎవరనేది వెల్లడించింది. ఇప్పటికీ అతడి డీటెయిల్స్ తెలియవు.
ఈ సంగతి పక్కనపెడితే, సదరు ప్రియుడితో తనకు పెళ్లయిందా లేదా అనే విషయాన్ని కూడా ఆమె వెల్లడించలేదు. చివరికి బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ విషయాన్ని వెంటనే చెప్పలేదు. పెళ్లి, పిల్లాడికి సంబంధించి ఇంకా ఎన్ని షాకులిస్తుందో చూడాలి.