'..వైఎస్ కాదు, వైఎస్ జగన్ అంతకన్నా కాదు. అక్కడున్నది కేసిఆర్. ఏదో రకంగా తాట తీస్తాడు..ఇది ఆంధ్ర కాదు, హైదరాబాద్. అందుకే ఎక్కడి మీడియా అక్కడ గప్ చుప్ గా వుంది…' ఇవి మా మాటలు కాదు. హైదరాబాద్ మీడియా సర్కిళ్లలో వినిపిస్తున్న మాటలు. తెలంగాణ ఎన్నికల్లో కేసిఆర్ మాంచి మెజారిటీ తో సింహాసనం అధిష్టించగానే తెలుగునాట ఓ సామాజిక వర్గం గుప్పిట్లో వున్న మీడియా, అది ప్రింట్ కావచ్చు, విజువల్ మీడియా కావచ్చు. పూర్తిగా సైలంట్ అయిపోయింది. కిక్కురు మనడం లేదు. ఇదే కనుక కాంగ్రెస్ ప్రభుత్వమో, జగన్ ప్రభుత్వమో అయితే వేరేలా వుండేది పరిస్థితి.
ముఖ్యమంత్రి వైఖరి ఏమిటి? ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఎప్పుడు? మంత్రులు ఏరీ? శాసనసభను ముందుగా రద్దు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాలన స్థంభించింది. మంత్రుల లేక ఫైళ్లు పేరుకుపోతున్నాయి. ఎమ్మెల్యేలు లేక అధికారుల ఇష్టారాజ్యంగా వుంది.
ఇలా రకరకాల కథనాలు పుట్టుకు వచ్చేవి.
సరే, ఈ సంగతి పక్కన పెడదాం, జాతీయ మీడియాలో కావచ్చు, లేదా ఎక్కడో నేషనల్ వెబ్ సైట్ లో కావచ్చు, జగన్ కు పది కిలోమీటర్ల దూరం వుండే వార్త వచ్చినా తెలుగుదేశం అను'కుల'మీడియా రెచ్చిపోతుంది. ఆ పది కిలోమీటర్ల దూరాన్ని, తీసేసి, నానా లింకులు కలిపేసి, నానా హంగామా చేస్తుంది.
తెలంగాణ ఎన్నికల తరువాత నేషనల్ చానెళ్లలో, మీడియాలో ఓటింగ్, కౌంటింగ్ వ్యవహారాలపై స్కామ్ అంటూ బోలెడు స్టోరీలు పుట్టుకు వచ్చాయి. ఇక్కడ మీడియా పొరపాటున కూడా వాటిని టచ్ చేస్తే ఒట్టు. ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు కావాలంటే..ఫస్ట్ పేరాగ్రాఫ్ ను మళ్లీ చదువుకోవడమే.
ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు కేటీఆర్ అననే అన్నారు. ఆ రెండు పత్రికల సంగతి పూర్తిగా తెలిసివచ్చింది. ఫలితాల తరువాత వాటి సంగతి చూస్తాం అని. అది దృష్టిలో పెట్టుకునే కావచ్చు, కెటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక, ఆయనను అభినందిస్తూ పార్టీ జనాలు ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనలు ఓ దినపత్రికలో కనిపించలేదు.
మొత్తం మీద కొన్నాళ్ల పాటు బాబుగారి సేవలో, సామాజిక బంధాలతో, జనాలను తాము అనుకున్న దారిలోనే నడిపించే ఓ వర్గం మీడియాకు ఇక తెలంగాణలో మాత్రం ఆ ఆటలు చెల్లుబాటు కావేమో?
అన్ని దోశలు ఎలా వేశావ్ భయ్యా.. ఆకలేసి ఫన్నీ వీడియో
కేసీఆర్‌లా గెలిచినట్టుగా గెలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్