పేరుకు వీళ్లిద్దరిదీ ఒకటే కాంపౌండ్. కానీ పవన్ కల్యాణ్ విషయంలో ఇద్దరిలో ఎంతో తేడా. జస్ట్ 24 గంటల వ్యవధిలో పవన్ పై రామ్ చరణ్, అల్లు అర్జున్ స్పందించిన తీరు చూస్తే ఎవరికైనా తేడా ఇట్టే తెలిసిపోతుంది. ఒకరేమో పవన్ పై విపరీతమైన ప్రేమను కురిపిస్తే, మరొకరు పవన్ పేరెత్తడానికి మరోసారి ఇబ్బందిపడ్డారు.
పడి పడి లేచే మనసు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యాడు బన్నీ. ఒకప్పుడు చెప్పను బ్రదర్ అంటూ వివాదం రేపిన ఈ హీరో, ఈ కార్యక్రమంలో మరోసారి అదే బాణీ వినిపించాడు. అభిమానులు పవన్..పవన్ అని గోల చేస్తుంటే 'ఆగు బ్రదర్' అంటూ ఆపాడు. ఆ తర్వాత మాటల సందర్భంగా పవన్ పేరును ప్రస్థావించి మమ అనిపించాడు. 'ఇందాకే ఆ పేరు చెప్పేశానుగా' ఇక గోల చేయొద్దు అంటూ తప్పించుకున్నాడు.
అదే రామ్ చరణ్ విషయానికొచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. అంతరిక్షం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన రామ్ చరణ్, మైక్ పట్టుకున్నది మొదలు ఎప్పుడు పవన్ గురించి మాట్లాడదామా అనే ఆత్రుత కనబరిచాడు. సినిమా యూనిట్ గురించి ప్రస్తావించి వీలైనంత తొందరగా బాబాయ్ మేటర్ లోకి వెళ్లిపోయాడు. పవన్ స్పీచ్ లోంచి కొన్ని మంచి వాక్యాల్ని తను మరోసారి గుర్తుచేశాడు.
రీసెంట్ గా బన్నీ, పవన్ కలిసిపోయారని అంతా అనుకున్నారు. శ్రీరెడ్డి ఇష్యూ జరిగినప్పుడు ఫిలింఛాంబర్ లో ఇద్దరూ ఒకర్నొకరు కౌగలించుకున్నారు కూడా. కాకపోతే అదంతా పైపైనే అనే విషయం ఇప్పుడు మరోసారి రుజువైంది. పవన్ గురించి మాట్లాడ్డానికి బన్నీ పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇలా ఒక రోజు తేడాలో పవన్ పై తమకు ఎంతపాటి ప్రేమ ఉందో అటు బన్నీ, ఇటు చెర్రీ ప్రూవ్ చేసుకున్నారు.
అన్ని దోశలు ఎలా వేశావ్ భయ్యా.. ఆకలేసి ఫన్నీ వీడియో
కేసీఆర్‌లా గెలిచినట్టుగా గెలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్