ఆర్ఆర్ఆర్ లో సముద్రఖని

రఘువరన్ బిటెక్, కాలా సినిమాలు చూసిన వారికి సముద్రఖని గుర్తు వుండే వుంటారు. డైరక్టర్ గా మంచి సినిమాలే చేసినా, ఆ తరువాత తరువాత వెనుక బడ్డారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం మంచి…

రఘువరన్ బిటెక్, కాలా సినిమాలు చూసిన వారికి సముద్రఖని గుర్తు వుండే వుంటారు. డైరక్టర్ గా మంచి సినిమాలే చేసినా, ఆ తరువాత తరువాత వెనుక బడ్డారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగునాట కూడా సముద్రఖని పరిచయమే అయినా, సరైన పాత్రలు ఆయనను వెదుక్కుంటూ రాలేదు. కానీ ఇప్పుడు సూపర్ చాన్స్ వచ్చేసింది.

రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో 300 కోట్ల బడ్జెట్ తో తయారవుతున్న సినిమాలో కీలకపాత్రకు సముద్రఖనిని తీసుకున్నారు. ఎంత కీలకమైన పాత్ర అంటే తొలి షెడ్యూలు లోనే రామ్ చరణ్-ఎన్టీఆర్ యాక్షన్ ఎపిసోడ్ లలో కూడా సముద్రఖని పాత్ర కనిపించేంత. 

బాహుబలి సినిమాలో తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యరాజ్ ను తీసుకుని, నేషనల్ వైడ్ గా పేరు వచ్చేట్లు చేసారు రాజమౌళి. ఇప్పుడు సముద్రఖని పాత్ర ఎలావుంటుందో? ఏ రేంజ్ పేరు వస్తుందో చూడాలి.