ఈ ఏడాది తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి. ఇదివరకూ కూడా ఇతడి డబ్బింగ్ సినిమాలు కొన్ని ఫర్వాలేదనిపించుకున్నాయి. అయితే ఈసారి మణిరత్నం 'నవాబ్' వంటి భారీ పిక్చర్ తో వైడ్ రేంజ్ గుర్తింపు సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి. అంతమంది స్టార్లున్న ఆ సినిమాలో ఇతడు తెలుగు వాళ్లకు గుర్తుండిపోయే పాత్రను చేశాడు.
ఇక తమిళంలో కూడా మరిన్ని మంచి సినిమాలు పడ్డాయి ఇతడికి. 96 రూపంలో మరో భారీ విజయం కూడా విజయ్ సేతుపతికి దక్కింది. ఇక ఈ వారంలో కూడా ఈ నటుడి సినిమా విడుదల కాబోతోంది. ఓవరాల్ గా నటుడిగా విజయ్ సేతుపతికి ఇదొక ఒక మరపురాని సంవత్సరం.
కానీ ఈ సంవత్సరం తను ఆర్థికంగా భారీగా నష్టపోయానని ఈ నటుడు చెబుతున్నాడు. ఈ సంవత్సరం తనకు ఆర్థికంగా పెద్ద సెట్ బ్యాక్ ఎదురైందని చెబుతున్నాడు. అదెలా అనే విషయం గురించి ఇతడు డైరెక్టుగా చెప్పలేదు.
కానీ… అదెలాగో మీడియా విశ్లేషిస్తోంది. ఈ ఏడాది విజయ్ సేతుపతి నిర్మాతగా ఒక సినిమాను రూపొందించాడు. జుంగా అనే సినిమాను రూపొందించాడు విజయ్. ఈ సినిమా కోసం పదకొండు కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేశాడట ఈ నటుడు. చాలాభాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫెయిల్యూర్ అయ్యింది. దీంతో విజయ్ సేతుపతి భారీగా నష్టపోయాడట.
ఈ సినిమా నష్టాల నుంచి బయటపడటానికి, అందుకు సంబంధించిన అప్పులు తీర్చడానికి తను మూడు సినిమాల పారితోషకాన్ని త్యాగం చేశాడట.
డైరెక్టర్ హీరోను ఇంటర్వ్యూ చేస్తే… అది ఎంత ఫన్నీగా ఉంటుందో చూడండి
కేసీఆర్‌లా గెలిచినట్టుగా గెలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్