సుజిత్-బాబీలకు ‘చిరు’ పరిక్ష

వెంకీమామ అనే యావరేజ్ సినిమా ఇచ్చారు దర్శకుడు బాబీ. సాహో లాంటి భారీ సినిమా చేసినా, అసంతృప్తే మిగిలింది డైరక్టర్ సుజిత్ కు. ఇప్పుడు ఈ ఇధ్దరికి ఓ పరిక్ష ఎదురయింది. పైగా ఈ…

వెంకీమామ అనే యావరేజ్ సినిమా ఇచ్చారు దర్శకుడు బాబీ. సాహో లాంటి భారీ సినిమా చేసినా, అసంతృప్తే మిగిలింది డైరక్టర్ సుజిత్ కు. ఇప్పుడు ఈ ఇధ్దరికి ఓ పరిక్ష ఎదురయింది. పైగా ఈ పరిక్ష అలాంటి ఇలాంటిది కాదు, ఇది పాస్ అయితే మాంచి సినిమా చాన్స్ వరిస్తుంది. మెగాస్టార్ చిరంజీవిని డైరక్ట్ చేసే అవకాశం లభిస్తుంది.

విషయం ఏమిటంటే, మలయాళ సినిమా లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేయాలన్నది మెగాస్టార్ సంకల్పం. కానీ ఆ సినిమా అలా యాజ్ ఇట్ ఈజ్ గా తీస్తే బండి నడవదు. రీమేక్ లు చేయడంలో గట్టివాడు అనిపించుకున్న వివి వినాయక్ ను అడిగితే తాను ఆ సినిమా చేయను అని మెల్లగా చెప్పేసారు. ఇప్పుడు లూసిఫర్ కథను మార్చి, తెలుగువారికి నప్పేలా ఎవరు చేస్తారు?

ఈ బాధ్యతను ఇద్దరు డైరక్టర్లు బాబీ, సుజిత్ లకు అప్పగించారట మెగాస్టార్. ఎవరు లూసిఫర్ ను మాంచి తెలుగు స్క్రిప్ట్ గా మార్చి తెస్తే, వారికి డైరక్షన్ చాన్స్ అని చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు డైరక్టర్లు ఆ ఫని మీద ఫుల్ బిజీగా వున్నారు. మెగాస్టార్ టేస్ట్ కు తగినట్లు వుండాలి. లూసిఫర్ ఇంటెన్సిటీ తగ్గకూడదు. అన్ని విధాలా మంచి మార్పులు అనిపించుకోవాలి. మరి సుజిత్, బాబీ ఎవరు పాస్ అవుతారో? ఈ పరిక్ష?

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా