క‌రోనా కాల మ‌హిమ-వినూత్న అవ‌గాహ‌న‌

ఏం చేద్దాం…ఇది క‌లికాలం కాదు, క‌రోనా కాలం వ‌చ్చింది.  ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో విస్త‌రించి గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. జ‌బ్బుకంటే, దాని పేరే ఎక్కువ భ‌య‌పెడుతోంది. అంతా క‌రోనా కాల మ‌హిమ‌. కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) వ్యాప్తి…

ఏం చేద్దాం…ఇది క‌లికాలం కాదు, క‌రోనా కాలం వ‌చ్చింది.  ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో విస్త‌రించి గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. జ‌బ్బుకంటే, దాని పేరే ఎక్కువ భ‌య‌పెడుతోంది. అంతా క‌రోనా కాల మ‌హిమ‌. కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) వ్యాప్తి చెందిన నేపథ్యంలో దేశీయ టెలికాం సంస్థలు కీలక ప్రచారాన్ని చేపట్టాయి.  మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కాల్‌ చేసిననపుడు ఒక అవగాహనా సందేశాన్ని ప్లే చేస్తోంది.

కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి నివారణకు అనుసరించాల్సిన ముందు  జాగ్రత్త చర్యలతో ఈ సందేశం  ఉంది. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు తోచిన రీతిలో ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా సెల‌బ్రిటీలు క‌రోనా ల‌క్ష‌ణాలు, నివార‌ణోపాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా అవ‌గాహ‌న క‌ల్పిస్తూ త‌మ వంతు సామాజిక బాధ్య‌త‌ను నెర‌వేరుస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్ర‌భుత్వ , ప్రైవేట్ సంస్థ‌లు కూడా సామాజిక బాధ్య‌త నిర్వ‌ర్తిస్తున్నాయి.

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌,  రిలయన్స్‌ జియో వినియోగదారులకు ఫోన్‌ చేసినపుడు  క‌రోనాపై అవ‌గాహ‌న సందేశాన్ని వినియోగదారులకు వినిపిస్తున్నాయి.  దగ్గు శబ్దంతో సందేశం ప్రారంభమవుతుంది.

“మీరు నవల కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. దగ్గినపుడు లేదా తుమ్ముతున్నప్పుడు మీ ముఖాన్ని చేతిరుమాలు అడ్డుపెట్టుకోండి. సబ్బుతో చేతులను నిరంతరం శుభ్రం చేసుకోండి” అనే సందేశం హిందీ, ఆంగ్లంలో ప్లే అవుతుంది. “ముఖం, కళ్ళు లేదా ముక్కును తాకకండి. ఎవరికైనా దగ్గు, జ్వరం లేదా ఊపిరి కష‍్టంగా వుంటే వారి నుంచి కనీసం ఒక‌ మీటర్‌ దూరంలో వుండండి. దూరాన్ని  అవసరమైతే, వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి” అనే సందేశాన్ని ఇస్తోంది. ఈ సందేశం ఎంతో ఆక‌ట్టుకుంటోంది.

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా

వీడు మా అమ్మ నాన్న కంటే బాగా చూసుకున్నాడు