షాకింగ్.. కుటుంబం మొత్తానికి సోకిన కరోనా

మొన్నటికిమొన్న ఆగ్రాలో ఒకే కుటుంబంలో నలుగురికి వైరస్ సోకింది. ఇప్పుడు అలాంటి ఘటనే కేరళలో వెలుగుచూసింది. తిరువనంతపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకినట్టు, కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ తప్పు…

మొన్నటికిమొన్న ఆగ్రాలో ఒకే కుటుంబంలో నలుగురికి వైరస్ సోకింది. ఇప్పుడు అలాంటి ఘటనే కేరళలో వెలుగుచూసింది. తిరువనంతపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకినట్టు, కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసా?

ఈ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఇటలీ వెళ్లి వచ్చారు. అందరికీ చెక్ చేసినట్టుగానే వీళ్లకు కూడా ఎయిర్ పోర్ట్ లో పరీక్షించాల్సి ఉంది. కానీ ఈ ముగ్గురు తమ వివరాల్ని ఎయిర్ పోర్ట్ లో సమర్పించలేదట. తమ ప్రయాణ వివరాలు ఇవ్వని కారణంగానే వాళ్లకు తక్షణమే పరీక్షలు చేయలేదని, అది ఇప్పుడు ఆ కుటుంబానికి ప్రమాదంగా మారిందని ప్రభుత్వం ప్రకటించించింది.

ఇటలీ నుంచి వచ్చిన ఆ ముగ్గురు కుటుంబ సభ్యుల వల్ల ఇంట్లో ఉన్న మిగతా ఇద్దరు కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ప్రస్తుతం ఈ ఐదుగుర్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు కేరళ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో భారత్ లో కరోనా సోకిన వారి సంఖ్య 39కి చేరింది.

ప్రస్తుతం భారత్ లోని అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. వాళ్లు ఏ దేశం నుంచి వస్తున్నారనే విషయంతో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ ఫ్లయిట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కర్ని తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచంలో 60 దేశాలకు పైగా వ్యాపించింది. హైదరాబాద్ లో ఈరోజు కొత్తగా ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా