విశాఖ రాజధాని వెనక ఉన్నది ఆయనేనట !

విశాఖను పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సగం దూరంలో ఉంది.  ఆసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినా శాసనమండలిలో బ్రేక్ పడింది. సరే ఇవాళ కాకపోయినా రేపు అయినా విశాఖ…

విశాఖను పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సగం దూరంలో ఉంది.  ఆసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినా శాసనమండలిలో బ్రేక్ పడింది. సరే ఇవాళ కాకపోయినా రేపు అయినా విశాఖ రాజధాని కావడం ఖాయమని వైసీపీ నేతలు అంటున్నారు.

మరి ఇంతకీ విశాఖ రాజధాని ప్రతిపాదన ఎవరిదీ, అసలు ఆ ఆలోచన జగన్ కి ఎలా వచ్చిందన్నది ఇప్పటికీ ఒక  పెద్ద చర్చగానే ఉంది. ఆ లోగుట్టుని మంత్రి అవంతి శ్రీనివాస్ తాజాగా విప్పారు.  విశాఖ రాజధాని ప్రతిపాదన ఎంపీ విజయసాయిరెడ్డిదని క్లారిటీగా చెప్పేశారు.  ఇన్నాళ్ళకు విశాఖ రాజధాని అవుతుందంటే దాని వెనక కృషి, పట్టుదల అన్నీ కూడా విజయసాయివేనని అంటున్నారు.

విశాఖ రాజధాని తొందరలోనే అవుతుందని కూడా ఆయన చెప్పారు.  విశాఖ రాజధాని కావడం ఏపీ ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తుందని, గ్రోత్ ఇంజన్ గా రాష్ట్ర అభివృద్దికి వైజాగ్ సిటి బాగా ఉపయోగపడుతుందని మంత్రి అంటున్నారు.

ఆ విషయాలు ఎలా ఉన్నా విశాఖ రాజధాని వెనక మిష్టర్ వి  అదే విజయసాయిరెడ్డి ఉన్నారని మంత్రి ఇలా విప్పి  చెప్పాక ఇపుడు టీడీపీ పచ్చ గొంతుకలు మరెన్ని కధలు అల్లుతాయో. ఇక్కడ భూములు దోచుకోవడానికి స్కెచ్ గీశారని ఇప్పటికే ఘాటు విమర్శలు చేస్తున్న సైకిల్ బ్యాచ్ కి మంత్రి ఉప్పందించారా, ఇంతకీ ఆయన విజయసాయిని పెంచరా, దించారా.

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా