మారుతికి మళ్లీ మిడ్ రేంజ్ హీరోనే

‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో తన వర్త్ చాటుకున్న దగ్గర్నుంచీ మారుతి అగ్ర హీరోలతో పని చేసే అవకాశం కోసం చూస్తూనే వున్నాడు. అల్లు అర్జున్‌కి బాగా క్లోజ్ అయినప్పటికీ ఇంతవరకు అతనికి బన్నీ…

‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో తన వర్త్ చాటుకున్న దగ్గర్నుంచీ మారుతి అగ్ర హీరోలతో పని చేసే అవకాశం కోసం చూస్తూనే వున్నాడు. అల్లు అర్జున్‌కి బాగా క్లోజ్ అయినప్పటికీ ఇంతవరకు అతనికి బన్నీ నుంచి పిలుపు రాలేదు. మధ్యలో కొందరు స్టార్ హీరోల కోసం ప్రయత్నాలు చేసినా కానీ మారుతి ప్రస్తుతానికి మిడ్ రేంజ్ హీరోలతో అడ్జస్ట్ అయిపోతున్నాడు.

‘ప్రతిరోజూ పండగే’తో ఘన విజయం సాధించినా కానీ మారుతికి అగ్ర హీరోల నుంచి కబురు రాలేదు. దాంతో మరోసారి మిడ్ రేంజ్ హీరోతోనే చేయడానికి ప్రయత్నాల్లో వున్నాడు. ఈసారి మారుతి సినిమాలో రామ్ నటిస్తాడని అంటున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్‌లో చేసే ఈ చిత్రానికి రామ్ తప్ప మారుతికి ఇంకో ఆప్షన్ లేదు. మిగతా మిడ్ రేంజ్ హీరోలంతా రెండు, మూడు ప్రాజెక్టులతో బిజీగా వున్నారు.

‘రెడ్’ తర్వాత ఏ సినిమా చేయాలనేది రామ్ ఇంకా డిసైడ్ అవలేదు. రెండు యాక్షన్ సినిమాల తర్వాత మారుతి మార్కు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానమైన చిత్రం చేస్తే రామ్‌కి ఖచ్చితంగా బెనిఫిట్ వుంటుంది. ఇక మారుతి విషయానికి వస్తే, ఏ దర్శకుడు తన మాదిరిగా నిలకడ చూపించినా ఈపాటికి అగ్ర హీరోలకి ప్రమోషన్ పొంది వుండేవాడు. కానీ మారుతికే ఎందుకో ఆ దిశగా అవకాశాలు రావడం లేదు.

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా