ఎట్టకేలకు బాలయ్య-బోయపాటి సినిమా స్టార్ట్ అయింది. రామోజీ ఫిలిం సిటీలో ఫైట్లు తీస్తున్నారు. అయితే షూటింగ్ లో పాల్గొంటున్న హీరో బాలయ్య మాత్రం కాస్త అన్ ప్లెజెంట్ గా కనిపిస్తున్నట్లు బోగట్టా. చిన్న చిన్న విషయాలకే ఆయన ఇరిటేట్ అవుతున్నారని, కసురుకుంటున్నారని ఇండస్ట్రీలో గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది.
దీనికి కారణం కూడా వుందని తెలుస్తోంది. మేకప్ టీమ్ లో, ఇంకా అనేక క్రాప్ట్ ల్లో బాలయ్య చెప్పిన వారికి దర్శకుడు బోయపాటి చోటివ్వలేదని తెలుస్తోంది. ఈ సినిమా ఎవరికి అవసరం అంటే బోయపాటికే. ఈ సినిమా హిట్ కాకుంటే బోయపాటి కెరీర్ కు ఆల్ మోస్ట్ ఫుల్ స్టాప్ పడిపోతుంది. అందుకే ఆయన ఎక్కడా రాజీ పడకుండా సరైన వాళ్లను ఏరి కోరి మరీ ప్రొడక్షన్ లోని వివిధ శాఖల్లోకి తీసుకుంటున్నారు. ఇక్కడే బాలయ్య తన రికమెండేషన్లు పని చేయలేదని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
ఇందువల్ల సెట్ లో చిన్న చిన్న వాటికే ఆయన కసురు కోవడం, కోప్పడ్డం వంటివి చేస్తున్నారని టాక్. ఏమైనా యూనిట్ జనాలు బాలయ్యతో కాస్త జాగ్రత్తగానే వుండాలి. లేదూ అంటే తేడా వస్తే దబిడి దిబిడే.