వకీల్ సాబ్..టైటిల్స్ సాంగ్

టైటిల్ సాంగ్ వేరు..టైటిల్స్ సాంగ్ వేరు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ కోసం ఓ టైటిల్స్ సాంగ్ తయారుచేసారు. మహిళల గొప్పతనం పేర్కొంటూ, కవి రామజోగయ్య శాస్త్రి అందించిన గీతం.…

టైటిల్ సాంగ్ వేరు..టైటిల్స్ సాంగ్ వేరు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ కోసం ఓ టైటిల్స్ సాంగ్ తయారుచేసారు. మహిళల గొప్పతనం పేర్కొంటూ, కవి రామజోగయ్య శాస్త్రి అందించిన గీతం. ఈ పాట సినిమాలో టైటిల్స్ నేపథ్యంలో వినిపిస్తారని తెలుస్తోంది. థమన్ సంగీతంలో సిద్ శ్రీరామ్ పాడిన గీతం ఇది. 

''..మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా…
మగువా మగువా నీ సహనానికి సరిహద్దు లు కలవా…

అంటూ సాగే ఈ గీతంలో మంచి పదాలు, భావనలు చొప్పించారు. ఆలయాలు కోరని ఆదిశక్తి రూపం అనే పద ప్రయోగం బాగుంది. నీదగు లాలనలో ప్రతి మగవాడు పసివాడేగా అని అనడంలో దత్తాత్రేయ పుట్టుక వైనం ప్రస్తావన అన్యాపదేశంగా వినిపించింది. 

థమన్ ఈ మధ్యన చాలా శ్రద్దగా ట్యూన్ లు చేస్తున్నారు. కష్టపడి దక్కించుకున్న ఈ స్థాయిని కాఫాడుకోవాలన్న తపన కనిపిస్తోంది. అయితే సిద్ శ్రీరామ్ ను రిపీట్ చేయడం తగ్గించాలి. లేదూ అంటే బోర్ కొట్టేస్తుంది. విజయ్ ఏసుదాస్ లాంటి వాళ్లను ట్రయ్ చేయవచ్చు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత.