ఒకసారి కన్‌ఫర్మ్ అయిపోయిన ప్రాజెక్ట్ సడన్‌గా డౌట్‌లో పడితే ఏ హీరోకి అయినా ఇబ్బంది వుంటుంది. అయితే పరశురాం డైరెక్షన్‌లో సినిమా ఓకే చేసి పెట్టుకున్న చైతన్య ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడితే దాని గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. చైతన్యతో 14 రీల్స్ చిత్రాన్ని ఓకే చేసిన ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురాం ఇప్పుడు మహేష్‌తో సినిమా చేస్తున్నాడనే వార్త గురించి వినే వుంటారు.
చైతన్య సినిమా వాయిదా పడినా, అస్సలు లేకపోయినా సదరు నిర్మాతలకి ఇబ్బంది తప్పితే నాగచైతన్యపై మాత్రం ఆ ఎఫెక్ట్ అసలే లేదు. ఎప్పుడూ నాలుగైదు చిత్రాలని ఓకే చేసి పెట్టుకునే చైతన్య ఇది లేకపోతే వేరే ప్రాజెక్ట్‌కి మూవ్ అవ్వాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. తనతోనే సినిమా చేయాలంటూ పంతం పట్టకుండా తదుపరి చిత్రం గురించిన టాక్స్ ఇప్పటికే స్టార్ట్ చేసాడు.
చైతన్యకి ఫుల్ క్లారిటీ వున్నా కానీ ఇంకా మహేష్‌పరశురాం సినిమాపైనే హండ్రెడ్ పర్సంట్ క్లారిటీ లేదు. వంశీ పైడిపల్లితో సినిమా సడన్‌గా కాన్సిల్ చేసుకున్న మహేష్‌కి అప్పటికప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రపోజల్ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఏ సంగతీ ఇంకా మహేష్ కానీ, పరశురాం కానీ అధికారికంగా ధృవీకరించలేదు.