సీనియారిటీ చూపించిన హీరో.. బుక్కయిన డైరక్టర్

ఓ సీనియర్ హీరోను డైరక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. ఎంత పక్కాగా సీన్ రాసుకున్నప్పటికీ, ఒక్కోసారి సదరు హీరో ఇగోను శాటిస్ ఫై చేయాల్సి ఉంటుంది. కల్కి సినిమా సెట్స్ లో దర్శకుడు…

ఓ సీనియర్ హీరోను డైరక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. ఎంత పక్కాగా సీన్ రాసుకున్నప్పటికీ, ఒక్కోసారి సదరు హీరో ఇగోను శాటిస్ ఫై చేయాల్సి ఉంటుంది. కల్కి సినిమా సెట్స్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మకు అలాంటి అనుభవమే ఎదురైంది. రాజశేఖర్ తన ఇగో చూపించాడు, ప్రశాంత్ ఫలితం అనుభవించాడు.

కల్కి షూటింగ్ టైమ్ లో ఓ సీన్ లో రాజశేఖర్ కాస్త ఎక్కువ చొరవ చూపించాడట. కానీ హీరో చెప్పిన మార్పులు దర్శకుడికి నచ్చలేదు. తను రాసుకున్న సన్నివేశానికే కట్టుబడి ఉంటానని హీరోకు చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో 30 ఇయర్స్ ఇండస్ట్రీ రాజశేఖర్ కు కోపమొచ్చింది. ఫలితంగా ఆ రోజు షూట్ మొత్తం క్యాన్సిల్ అయింది.

కొన్నిరోజుల కిందట హైదరాబాద్ లో కల్కి షెడ్యూల్ లో జరిగిన ఘటన ఇది. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ తన సహచరుల వద్ద చెప్పుకొని బాధపడ్డాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ప్రశాంత్ కు ఇలా జరగడం ఇది రెండోసారట.

త్వరలోనే కల్కి షూటింగ్ కు చిన్న గ్యాప్ ఇవ్వబోతున్నాడు ఈ దర్శకుడు. ఎందుకంటే ఈ దర్శకుడు సగం డైరక్ట్ చేసిన దటీజ్ మహాలక్ష్మీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆ ప్రచారంలో ప్రశాంత్ పాల్గొంటాడు.

21న ఈ సినిమా టీజర్ రిలీజ్ అవుతోంది. దటీజ్ మహాలక్ష్మి సినిమాకు సంబంధించి మొదటి దశ ప్రచారం ముగిసిన వెంటనే తిరిగి కల్కి సెట్స్ పైకి వచ్చేస్తాడు ఈ దర్శకుడు.

త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే