Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాయిపల్లవితో సమస్య?

సాయిపల్లవితో సమస్య?

సాయిపల్లవికి తెలుగునాట వున్న క్రేజ్ ఇంతా అంతా కాదు. ఫిదా తరువాత ఆ అమ్మాయికి పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. పడి పడిలేచే మనసు సినిమాకు అదే శ్రీరామరక్ష. కానీ మళ్లీ అదే సమస్యగా కూడా మారేలా కనిపిస్తోంది. 

అనుకోకుండా మరో సినిమా, అది కూడా సాయి పల్లవి మాంచి హుషారుగా నటించిన సినిమా ఇప్పుడు పడి పడి లేచె మనసుకు పోటీగా వచ్చింది. తమిళంలో హీరో ధనుష్ నటించిన మారి 2 సినిమాను తెలుగులో 21నే విడదుల చేస్తున్నారు. ఇది సడెన్ గా తెరమీదకు వచ్చింది.

ఈ సినిమాలో సాయిపల్లవి ఒక రేంజ్ హుషారులో నటించింది. పైగా ధనుష్ అంటే బి సి సెంటర్లలో క్రేజ్ వుంది. మరోపక్క పడి పడి లేచెమనసు సినిమాలో సాయి పల్లవి కాస్త సీరియస్ రోల్ చేసింది. ఇవన్నీ కలిసి మారి 2 కారణంగా 'పడి పడి'ని ఇబ్బంది పెడతాయేమో అన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?