మొత్తానికి నిర్మాత దిల్ రాజు వేట ఫలించింది. తమిళంలో క్లాస్ హిట్ గా నిలిచిన 96 సినిమాకు హీరో దొరికాడు. మళ్లీ అలా అని ఏదో అడ్జస్ట్ మెంట్ హీరో కాదు. పక్కాగా క్యారెక్టర్ కు నప్పే హీరో. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో యంగ్, మిడిల్ ఏజ్ క్యారెక్టర్లను అద్భుతంగా పోషించి, ఎమోషన్లను పండించిన శర్వానంద్ తెలుగులో 96 సినిమా చేయబోతున్నారు.
ఈ మేరకు అంతా ఓకె అయిందని తెలుస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన ఆ పాత్రను తెలుగులో ఎవరు చేస్తారా? అన్న దాని మీద చాలాపేర్లు వినిపించాయి. బన్నీ నుంచి నాని వరకు. ఆఖరికి శర్వానంద్ ను ఫిక్స్ చేసారు.
బన్నీ చేయాలని అనుకున్నాడు కానీ ముందుకు సాగలేదు. ఆఖరికి ఇప్పుడు శర్వానంద్ ఫిక్స్ అయ్యాడు. శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మతో చేస్తున్న సినిమా పూర్తికాగానే మార్చి లేదా ఏప్రియల్ నుంచి ఈ సినిమా వుంటుంది.
ఒక విధంగా శర్వానంద్ మంచి ఛాయిస్ అనే చెప్పుకోవాలి. ఎమోషన్లు బాగా పండించగలడు కదా?
త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్