మరదలు-లవర్ మధ్య నలిగిపోతున్న నాని

ఇది టక్ జగదీష్ మేటర్. శివ నిర్వాణ దర్శకత్వంలో రెండో సారి నటిస్తున్న నాని, ఈ సినిమాలో మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాలో నానికి మరదలు ఉంటుంది. సేమ్ టైమ్ ప్రేయసి…

ఇది టక్ జగదీష్ మేటర్. శివ నిర్వాణ దర్శకత్వంలో రెండో సారి నటిస్తున్న నాని, ఈ సినిమాలో మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాలో నానికి మరదలు ఉంటుంది. సేమ్ టైమ్ ప్రేయసి కూడా ఉంటుంది. వీళ్లిద్దరి మధ్య నలిగిపోయే మోస్ట్ ఎమోషనల్ పాత్రలో కనిపించబోతున్నాడు నాని.

నిన్ను కోరి సినిమాలో ప్రేమికుల మధ్య ఎమోషన్స్ చూపించిన శివ నిర్వాణ, మజిలీలో భార్యాభర్తల మధ్య ఎమోషన్స్ వరకు వెళ్లాడు. ఈసారి కుటుంబంలో ఉండే భావోద్వేగాల్ని టచ్ చేయబోతున్నాడు. ఈ మేరకు బావ-మరదలు, ప్రేయసి-ప్రియుడు బంధాల్ని సెట్ చేసిన నిర్వాణ… అన్నదమ్ముల అనుబంధం అనే మరో పవర్ ఫుల్ బంధాన్ని కూడా టక్ జగదీశ్ లో చూపించబోతున్నాడు.

సినిమాలో నానికి ప్రేయసిగా రీతూ వర్మ, మరదలిగా ఐశ్వర్య రాజేష్ కనిపించబోతున్నారు. ఇక నానికి పెద్జన్నయ్యగా జగపతిబాబు నటిస్తున్నాడు. ఇంటికి పెద్ద దిక్కు పాత్రలో కనిపించనున్న జగపతిబాబు.. నానితో కలిసి ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ పండించబోతున్నాడు. ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతున్న షూటింగ్ లో ఈ సన్నివేశాలే  చిత్రీకరిస్తున్నారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. జులై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

వీడు మా అమ్మ నాన్న కంటే బాగా చూసుకున్నాడు