చాలా అంటే చాలా ఏళ్ల క్రితమే పరుచూరి బ్రదర్స్ బలగం పొట్టి సీతయ్య అనే అద్భుతమైన రాజకీయ వేత్త క్యారెక్టర్ ను క్రియేట్ చేసి చూపించారు. డబుల్ స్టేట్ మెంట్ అనే గొప్ప సెటైర్ లు వేసారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, దాని మూలాల్లో వున్న సామాజిక మీడియాకు ఇదే ఆదర్శం. ఇలా అయితే అలా రాద్దాం.. అలా అయితే ఇలా రాద్దాం అన్నదే ఆలోచన
కొద్ది రోజుల క్రితం బిసిలకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే వార్తలు వచ్చాయి. దాంతో తెలుగుదేశం అను కుల సామాజిక మీడియా అప్రమత్తం అయిపోయింది. అమ్మో ఇలా అయితే బిసిలు దగ్గరైపోతారేమో అని భయపడిపోయింది. దాంతో వార్తలు వండి వార్చింది.. ఎలా?
జగన్ పాలనా కాలం మహా అయితే ఆరునెలలు వుంది. ఇప్పుడు బిసి లకు ఆ పోస్ట్ ఇచ్చి సుఖమేమిటి? జగన్ ఎలాగూ ఓడిపోతాడు. అప్పుడు టీటీడీ చైర్మన్ ఎలాగూ రిజైన్ చేయాల్సిందే. ఈ పాటి దానికి బిసి లకు ఇవ్వడం ఎందుకు అంటూ వార్తలు వండి వార్చేసారు.
కట్ చేస్తే, ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా కరుణాకరరెడ్డిని ఎంపిక చేసారు.
దాంతో మళ్లీ వార్తలు మొదలయ్యాయి. ఇప్పటికి రెండు పర్యాయాలు సుబ్బారెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ రెడ్డికే ఇచ్చారు. బిసి లు పనికి రారా అంటూ వార్తలు రాయడం ప్రారంభించేసారు.
ఇలాంటి వాళ్లను చూసి, లేదా ఇలాంటి వాళ్లే రాజకీయాల్లో వుంటారని ఊహించే పరుచూరి బ్రదర్స్ అలాంటి డబుల్ స్టేట్ మెంట్ క్యారెక్టర్ ను తయారు చేసారు.