ఇది తొలి సారి కాదు.. ఇది వరకూ కూడా ఆమె ఈ తరహా పోజులను షేర్ చేసింది. తమ హాలిడేయింగ్ లో భాగంగా తను, తన సోదరుడు ఈత కొలనులో ఉండగా.. తీయించుకున్న ఫొటోలను షేర్ చేసింది సారా అలీ ఖాన్. అప్పట్లోనే ఈ తీరును కొంతమంది తప్పు పట్టారు. ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారు.. అదేంటని ఆ ఫొటోల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సారా మాత్రం వాటిని పట్టించుకున్నట్టుగా లేదు.
ఇటీవలే ఆమె మళ్లీ ఆ తరహా ఫొటోను షేర్ చేసింది. దీంతో యథాతథంగా ఆమె ఫాలోయర్లు నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడ్డారు. సోదరుడితో ఏమిటలా.. అంటూ వారు సారాకు హితబోధ చేశారు. మరి కొందరేమో అందులో తప్పేముందని.. మీ కళ్లలోనే తప్పుందని కామెంట్లు పెట్టారు. యథారీతిన ఈ విషయంలో మోరల్ పోలిసింగ్ జరిగింది. మరి కొందరు ఈ మోరల్ పోలీసుల తీరును తప్పు పట్టారు.
ఈ విషయంలో తీర్పులు ఇవ్వడం సమంజసం కాదు. బికినీ అంటేనే కొంతమందికి కొన్ని రకాల వైబ్రేషన్స్ ఉండవచ్చు. మరి కొందరికి అది పెద్ద విషయం కాకపోవచ్చు. కలిసి నడిచే ఇద్దరు ఆడమగను చూసే… జనాలు రకరకాల కామెంట్లు చేసుకుంటూ ఉంటారు. వారిద్దరూ అన్నా చెల్లెళ్లు అయినా ఆ విషయం తెలియకపోతే నెగిటివ్ కామెంట్లే ఎక్కువగా ఉంటాయి. కలిసి నడిచి వెళ్లే వారినే బూతద్దంతో చూసే సమాజం మనది.
అలాంటి సమాజం ఇలాంటి ఫొటోలను జీర్ణించుకోలేకపోవచ్చు. ఇక సెలబ్రిటీలు ఇలాంటి సామాన్యులతో కలిసి ఏమీ బతకరు. వారి ప్రపంచం వేరే. కాబట్టి వారికి ఇలాంటి ఫొటోలు ఏ మాత్రం తప్పు కాదు కదా, అలాంటి నెగిటివ్ థాట్స్ వాళ్లకు ఉండకపోవచ్చు. అందుకే ఇలాంటి ఫొటోలను పోస్టు చేస్తూ ఉండవచ్చు. కానీ జనాలు మాత్రం వీటిని జీర్ణించుకోలేకపోతున్నారు. సారా పోస్టు చేసిన ఫొటోలపై నెగిటివ్ కామెంట్లే చాలా తీవ్రంగా ఉన్నాయి!