గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత మళ్లీ మరోసారి మైత్రీ మూవీస్ తో జతకట్టబోతున్నారు హీరో నాని. ఒకపక్క ఇంద్రగంటి డైరక్షన్ లో వి సినిమా విడుదలకు రెడీ అవుతోంది.
ఇప్పటికే టక్ జగదీష్ సినిమా చేస్తున్నారు. దాని తరువాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో శ్యామ్ సింగ రాయ్ సినిమా అనౌన్స్ చేసారు. దాని తరువాత మైత్రీ మూవీస్ కు సినిమా చేయబోతున్నారు.
అంటే గ్యాప్ లేకుండా నాలుగు సినిమాలు అన్నమాట. బ్రోచేవారెవరురా సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు వివేక్ ఆత్రేయ.ఆ సినిమా తరువాత తన డైరక్షన్ ప్రయత్నాలు చేసుకుంటూనే, మాటల రచయితగా కూడా తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. తన సెకెండ్ మూవీని మైత్రీకి కమిట్ అయి వున్నాడు. అందుకే ఈ కాంబినేషన్ సెట్ అయింది.
డిఫెరెంట్ రివెంజ్ స్టోరీ తీసుకుని మైత్రీ లో గ్యాంగ్ లీడర్ చేసిన నాని, ఈసారి మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వివేక్ ఆత్రేయ బౌండ్ స్క్రిప్ట్ తయారుచేసే పనిలోవున్నారు.