ఆహా అనే ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ స్టార్ట్ చేయగానే అల్లు అరవింద్ కు చెందిన గీతా 2 సంస్థ తన నిర్మాణాలు స్పీడప్ చేసింది. అఖిల్ తో సినిమా నిర్మిస్తూనే కార్తికేయతో సినిమా ప్రారంభించింది. అది అలా వుండగానే నిఖిల్ సినిమాకు పూజ చేసేసారు. ఇదిలా వుండగానే పలాస డైరక్టర్ కు అడ్వాన్స్ ఇచ్చేసారు.
పది కోట్ల లోపు బడ్జెట్ సినిమాలు పక్కాగా ప్లాన్ చేసి, ఇటు గీతా డిస్ట్రిబ్యూషన్ కు, అటు ఆహా కు కంటెంట్ ప్రోబ్లమ్ లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. అంతవరకు బాగానేవుంది. కానీ ఇంట్లో ఓ చిన్న హీరో వున్నాడన్న సంగతే అల్లు అరవింద్ మరిచిపోయినట్లు కనిపిస్తోంది.
సాధారణంగా యంగ్ హీరోలు అందరికీ ఒకేలాంటి సబ్జెక్ట్ నప్పే అవకాశం ఎక్కువ వుంటుంది. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. కానీ అఖిల్, నిఖిల్, కార్తికేయ వీళ్లందరి కోసం తయారుచేసిన సబ్జెక్ట్ ఏదీ శిరీష్ కు నప్పదా? శిరీష్ చేయలేడా? లేక శిరీష్ కు మార్కెట్ లేదని పక్కన పెట్టారా? లేక ఇవన్నీసాదా సీదా సబ్జెక్ట్ అని, శిరీష్ కు ది బెస్ట్ ఇవ్వాలని చూస్తున్నారా? అల్లు అరవింద్ కే తెలియాలి ఆ బిజినెస్ స్ట్రాటజీ ఏమిటో?