మనిషి-మృగం-ఓఢియన్

మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ది ఓ విలక్షణశైలి. కమర్షియల్ సినిమాల్లోనే వైవిధ్యం చూపించడం అతగాడికి మొదటి నుంచీ అలవాటు. టాప్ కమర్షియల్ హీరోగా వున్నపుడే కాలాపానీ లాంటి సినిమా చేసాడు. మొన్నటికి…

మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ది ఓ విలక్షణశైలి. కమర్షియల్ సినిమాల్లోనే వైవిధ్యం చూపించడం అతగాడికి మొదటి నుంచీ అలవాటు. టాప్ కమర్షియల్ హీరోగా వున్నపుడే కాలాపానీ లాంటి సినిమా చేసాడు. మొన్నటికి మొన్న మన్యం పులి, జనతాగ్యారేజ్, మనమంతా సినిమాలతో తన వైవిధ్యాన్ని మరోసారి చూపించాడు.

ఇప్పుడు ఈ వయసులో తన ఫిజిక్ ను తగ్గించుకుని, ఓడియన్ అనే వైవిధ్యమైన సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇప్పడు బయటకు వచ్చింది. మిస్టరీ పర్సన్ గా మోహన్ లాల్ కనిపిస్తు్న్న ఈ టీజర్ చూస్తుంటే మళ్లీ డిఫరెంట్ ప్రయత్నం ఏదో చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మళయాళంలో ఈ భారీ సినిమా నిర్మాణంలో మోహన్ లాల్ కూడా పాలు పంచుకున్నాడు. ఈ సినిమాలో పగలు మనిషిలా, రాత్రి మృగంలా మోహన్ లాల్ కనిపించబోతున్నాడని టాక్. అంతేకాదు, మన్యం పులిలో ఫులి హావభావాలను తనలో పలికించిన మోహన్ లాల్ ఇప్పుడు ఓడియన్ లో వివిధ జంతువుల హావభావాలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 14న ఈ సినిమా తెలుగులో విడుదల కాబోతోంది.