Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బెల్లంకొండ కొట్టారా? కొట్టలేదా?

బెల్లంకొండ కొట్టారా? కొట్టలేదా?

గత రెండు రోజుల్లో ఇండస్ట్రీ సర్కిళ్లలో ఓ వార్త ఓపెన్ గానే సర్క్యులేట్ అవుతోంది. అయితే ఈ వార్తలో నిజం పాలు ఎంత? అన్నదే క్లారిటీ లేదు. నిర్మాత కమ్ హీరో ఫాదర్ బెల్లంకొండ సురేష్ ఓ బయ్యర్ పై చేయి చేసుకున్నారన్న వార్త శుక్రవారం నుంచి ఎక్కువగా వినిపిస్తోంది.

కవచం సినిమా లావాదేవీల్లో సీడెడ్ బయ్యర్ కమ్ థియేటర్ ఓనర్ బ్రహ్మయ్యతో గడబడ జరిగినట్లు తెలుస్తోంది. తెల్లవారితే శుక్రవారం అనగా, ముందురోజు అర్థరాత్రి దాటాక డబ్బులు కట్టే విషయంలో బ్రహ్మయ్యకు, బెల్లంకొండ సురేష్ కు మధ్య గట్టి వాదన జరిగి, అదికాస్తా, గొడవగా మారినట్లు తెలుస్తోంది. అప్పుడే బెల్లంకొండ ఆవేశంలో బ్రహ్మయ్య మీద చేయిచేసుకున్నారని వినిపిస్తోంది.

అయితే ఇదంతా వట్టిదే అని, బెల్లంకొండకు, బ్రహ్మయ్యకు వాదన జరిగిన మాట వాస్తవమే కానీ చేయి చేసుకునే వరకు వెళ్లిలేదని కవచం సినిమా యూనిట్ జనాలు, బెల్లంకొండ సన్నిహితులు అంటున్నారు. జస్ట్ సినిమా విడుదల టెన్షన్ లో జరిగిన చిన్నగొడవ తప్ప, చేయి చేసుకునే వరకు వెళ్లలేదన్నది బెల్లంకొండ సన్నిహితుల సమాచారం.

అయితే అలా కాదు, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని చాంబర్ మెట్లు ఎక్కాలని బ్రహ్మయ్య ఆలోచిస్తున్నారని, సీడెడ్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు బ్రహ్మయ్యకు మద్దతుగా నిలవబోతున్నారన్నది మరోవర్గం చెబుతున్న సమాచారం. మొత్తంమీద ఇది ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?