Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వినయ విధేయలో ఆ హీరోయిన్

వినయ విధేయలో ఆ హీరోయిన్

ఎక్కడెక్కడ వున్నవాళ్లని ఏరి మరీ తీసుకువచ్చి, వినయ విధేయరామ సినిమాలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది దర్శకుడు బోయపాటి. వేషాలు మానేసి, ఇంట్లొవుండిపోయిన ఆర్యన్ రాజేష్, తెలుగు జనాలు ఆల్ మోస్ట్ మరచిపోయిన తమిళ హీరో ప్రశాంత్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

అనాధలంతా ఒకచోట చేరి అన్నదమ్ములన కుటుంబంలో సభ్యులుగా వారు కనిపించోతున్నారు. వీళ్లలో ఒకరి భార్యగా అలనాటి హీరోయిన్ స్నేహను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్నేహ ఈ మధ్య ఒకటి రెండు సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు మళ్లీ సినిమా ద్వారా కనిపించబోతోందన్నమాట.

ఇదిలావుంటే వినయ విధేయ కోసం బోయపాటి, రచయిత రత్నం కలిసి ఓ భారీ కథనే అల్లినట్లు తెలుస్తోంది. సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా నడుస్తుందని వినికిడి. సినిమా ఓపెనింగ్ షాట్ నే లెక్కకు దొరకనన్ని శవాల మధ్య నుంచి హీరో, విలన్ లేవడంతో స్టార్ట్ అవుతుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.

అనాధలైన హీరో, అతని స్నేహితుల చిన్నతనం ఎపిసోడ్ లు కూడా భారీ ఎమోషన్లతో వుంటాయని తెలుస్తోంది. మొత్తం వినిపిస్తున్న కథ తెలుసుకుంటూ వుంటే బోయపాటి భారీ ఎమోషనల్, యాక్షన్ ప్యాక్డ్ సినిమాను రామ్ చరణ్ కోసం తయారు చేసినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?