అహ్మ‌ద్ ప‌టేల్ కు మ‌ళ్లీ నోటీసులు, నెక్ట్స్ టార్గెట్ ఆయ‌నే?

కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ సోనియాగాంధీ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి అహ్మ‌ద్ ప‌టేల్ కు ఐటీ శాఖ నుంచి మ‌రోసారి నోటీసులు జారీ అయిన‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే అహ్మ‌ద్ ప‌టేల్ కు నోటీసులు అంద‌డం, ఆయ‌న అనారోగ్యం అంటూ…

కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ సోనియాగాంధీ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి అహ్మ‌ద్ ప‌టేల్ కు ఐటీ శాఖ నుంచి మ‌రోసారి నోటీసులు జారీ అయిన‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే అహ్మ‌ద్ ప‌టేల్ కు నోటీసులు అంద‌డం, ఆయ‌న అనారోగ్యం అంటూ త‌ప్పించుకోవ‌డం జ‌రిగింది. అయితే ఈ వ్య‌వ‌హారంలో మ‌రోసారి ఆయ‌న‌కు ఐటీ నోటీసులు ఇచ్చిన‌ట్టుగా స‌మాచారం.

ఏపీలో జ‌రిగిన ఐటీ దాడుల‌కూ.. అహ్మ‌ద్ ప‌టేల్ కు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసుల‌కు సంబంధం ఉండ‌ట‌మే.. ఈ వ్య‌వ‌హారంలో అస‌లైన ఆస‌క్తిదాయక‌మైన అంశం. ఇటీవ‌ల ఏపీ, తెలంగాణ లో జరిపిన సోదాల్లో ఐటీ అధికారుల చేతికి కీల‌క‌మైన ఆధారాలు ల‌భించిన‌ట్టుగా భోగ‌ట్టా. రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలకు వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ కోసం అహ్మద్ పటేల్ అందాయ‌ని ఐటీ శాఖ గుర్తించిన‌ట్టుగా స‌మాచారం. ఈ డ‌బ్బు అంతా ఏపీ నుంచి క‌ర్ణాట‌క‌కు వెళ్లింది, అక్క‌డ నుంచి అహ్మ‌ద్ ప‌టేల్ కు చేరింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వ్య‌వహారంపై ఇప్ప‌టికే ఆధారాల‌ను సంపాదించింద‌ట ఐటీ శాఖ‌. ముందుగా అహ్మ‌ద్ ప‌టేల్ ను విచారించ‌డం, ఆ త‌ర్వాత ఏపీకి సంబంధించి కాంగ్రెస్ తో అతి స‌న్నిహితంగా మెలిగిన ఒక ముఖ్య‌నేత‌ను విచారించ‌నున్నార‌ని స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ తో ఆయ‌న చాలా రాసుకుపూసుకు తిరిగారు. 

ఇటీవ‌లే ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మాజీ పీఎస్ ను కూడా ఐటీ అధికారులు విచారించిన సంగ‌తీ తెలిసిందే. ఆయ‌న నుంచి 150 కోట్ల రూపాయలు క్యాష్ తీసుకున్న నేత ఎవ‌రో ఆధారాలతో రూడీ చేసుకున్నార‌ట‌ ఆదాయపు పన్ను శాఖ అధికారులు. 150 కోట్ల  రూపాయలు తీసుకున్న ఆంధ్రుడు అంటూ గత ఏడాది నవంబర్ 11వ తేదిన ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ద్వారా ఐటీ శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌ కూడా చేసింది. 

అలాగే అమరావతిలో రూ. 2652 కోట్ల పనులకు సంబంధించి ఓ కంపెనీ నాటి ముఖ్యనేతకు అందచేసిన సొమ్ముకు సంబంధించిన ఆధారాలు  ఐటీ శాఖ‌కు అందాయ‌ని స‌మాచారం. ఆ కంపెనీ నుంచే నేరుగా సదురు ప్రముఖ వ్యక్తి కి 150 కోట్లు చేరినట్లు ఐటీ సంస్థ దర్యాప్తులో నిర్ధారించుకున్న‌ట్టుగా స‌మాచారం. 20 శాతం చొప్పున క‌మిష‌న్ల‌తో ఆ కంపెనీ దాదాపు 700 కోట్ల చెల్లించేలా ఒప్పందం చేసుకున్నార‌ట‌. తొలిదశలో 150 కోట్ల రూపాయలు అధికారికంగా చేతులు మారినట్లు ఐటీ సోదాల్లో సుస్పష్టం అయిన‌ట్టుగా స‌మాచారం.

ఈ విహారం పద్దతిని పాటిస్తే కరోనా సోకదు

ఈ సినిమా గురించి మాట్లాడితే తప్పు..