కాజల్ అగర్వాల్‌తో వరుసగా రెండు సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ సీనియర్ హీరోయిన్ని పొగడ్తలతో ముంచేస్తున్నాడు. ఆమె నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పుకుంటున్నాడు. కాజల్ కూడా శ్రీనివాస్ కష్టపడే నటుడు, స్వయంశక్తిపై ఆధారపడతాడు, అతడి తీరు తనలానే వుంటుందని చెప్పింది. వీరిద్దరూ కలిసి చేసిన కవచం శుక్రవారం విడుదలయింది.
ఈ చిత్రాన్ని కాజల్ కేవలం బెల్లంకొండ శ్రీనివాస్ మాట మీద చేసిందట. ఇందులో తనలాంటి సీనియర్ హీరోయిన్ చేసేటంత పాత్ర లేకపోయినా అతను అడిగాడని కవచంకి డేట్స్ ఇచ్చిందట. అయితే తేజతో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ కలిసి నటిస్తోన్న చిత్రంలో మాత్రం హీరోయిన్‌కి చాలా ప్రాధాన్యత వుంటుందట.
ఎంత ఇంపార్టెన్స్ అంటే సినిమా టైటిల్ కూడా హీరోయిన్ కోణంలోనే పెట్టేంత! ఈ చిత్రానికి సీత అనే టైటిల్ పరిశీలనలో వున్నట్టు సమాచారం. కాజల్ పోషిస్తోన్న సీత పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది కనుక అదే టైటిల్ ఖరారు చేయబోతున్నారట.
హీరోయిన్ ఓరియెంటెడ్ టైటిల్ పెట్టేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. ఈ ఇద్దరి మధ్య వున్న ఫ్రెండ్షిప్, కెమిస్ట్రీ, అండర్స్టాండింగ్ చూస్తోంటే ఇంకా మరిన్ని చిత్రాల్లో కలిసి నటించినా ఆశ్చర్యం లేదంటున్నారు.