మిస్టర్ ప్రెగ్నెంట్..ఫన్ విత్ ఎమోషన్

సోహైల్ హీరోగా తయారవుతున్న సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్. నిజానికి ఈ సినిమా నిర్మాణం స్టార్ట్ చేసి చాలా కాలం అయింది. కాస్త లేట్ గా అయినా లేటెస్ట్ గా ఈ నెల 18న విడుదలకు…

సోహైల్ హీరోగా తయారవుతున్న సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్. నిజానికి ఈ సినిమా నిర్మాణం స్టార్ట్ చేసి చాలా కాలం అయింది. కాస్త లేట్ గా అయినా లేటెస్ట్ గా ఈ నెల 18న విడుదలకు సిద్దం అవుతోంది. ఈ నేపథ్యంలో ట్రయిలర్ ను విడుదల చేసారు. ఏదో ఫన్నీ కాన్సెప్ట్ తో ఫన్ మూవీ తీస్తున్నారనే ఫీల్ ను ఈ ట్రయిలర్ చెరిపేసింది. ట్రయిలర్ ను ఇంట్రస్టింగ్ గా కట్ చేసారు.

ఆడుతూ పాడుతూ హాయిగా లైఫ్ ను గడిపేసే కుర్రాడు, ప్రేమ..పెళ్లి..అంతలోనే ఈ కనీవినీ ఎరుగని ట్విస్ట్. మగవాడికి ప్రెగ్నెన్సీ వస్తే ఎలా వుంటుందో అన్న ఫన్ మూవ్ మెంట్లు ఇలా వరుసగా ట్రయిలర్ లో పరుచుకున్నాయి. 

సోహైల్ ఎమొషన్ సీన్లను బాగానే హ్యాండిల్ చేసినట్లు కనిపిస్తోంది ట్రయిలర్ చూస్తుంటే. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి సీన్ల ను ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. హీరోయిన్ గా రూప బాగానే వుంది. సుహాసిని, బ్రహ్మాజీ, ఆలీ, రాజా రవీంద్, వైవా హర్ష తదితరులు ట్రయిలర్ లో కనిపించారు.

కేవలం ఫన్ మూవీ కాదు, కాస్త గట్టి కథ వుందని ట్రయిలర్ చెప్పగలిగింది. ఈ సినిమాకు నిర్మాత అప్పిరెడ్డి. గతంలో జార్జిరెడ్డి లాంటి వైవిధ్యమైన సినిమాను అందించారు.