బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా ఇప్పట్లో పూర్తి కావడం అన్నది సాధ్యం కాని సంగతి. డిసెంబర్ నాటికి కానీ రెడీ కాదని ఇండస్ట్రీ టాక్. అందుకే సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచన ప్రారంభమైందని వార్తలు బయటకు వచ్చాయి.
సినిమాలో కథ రెండు భాగాలుగా వుంటుంది. ఎర్రచందనం రవాణా కూలీగా ప్రారంభమై డాన్ గా ఎదిగిన హీరో కథ. తొలిసగం అంతా రఫ్ గా రగ్డ్ గా సాగుతుంది. డాన్ గా ఎదిగిన తరువాత అల్ట్రా స్టయిలిష్ గా వుంటుంది. పైగా కీలకమైన నటుడు ఫాజిల్ పోషిస్తున్న అటవీ రేంజర్ పాత్ర ఇంటర్వెల్ బ్యాంగ్ టైమ్ కు కానీ ఎంటర్ కాదని తెలుస్తోంది.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పుష్ప తొలిభాగాన్ని, మలి భాగాన్ని సెపరేట్ చేస్తే ఎలా వుంటుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. తొలిభాగాన్ని అక్టోబర్ 13న విడుదల చేస్తే ఎలా వుంటుందని కూడా లెక్కలు కడుతున్నారు.
తోలి భాగం ఫినిష్ చేయాలన్నా కనీసం 25 రోజులు పైనే షూట్ చేయాల్సి వుందట. ప్రభాస్ తరువాత రెండు భాగాల సినిమా చేసిన తెలుగు హీరోగా బన్నీ పేరు రికార్డుల్లో వుంటుంది. పైగా తొలిభాగం 200 కోట్లు మలి భాగం 200 కోట్లు మార్కెట్ చేసుకోవచ్చు.
కానీ నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా రాదు. వస్తే గిస్తే హీరో రెమ్యూనిరేషన్ లో తప్ప. కొద్ది రోజులు ఆగితే పుష్ప విషయంలో మరింత క్లారిటీ వస్తుంది.