దొరబాబు, పరదేశి…జబర్దస్త్ షోలో మస్త్‌మస్త్‌గా కామెడీ పండిస్తారు. ప్రేక్షకుల పొట్టలు పగిలేలా నవ్విస్తారు. ఇదంతా జబర్దస్త్‌కు ఒక వైపు మాత్రమే. ఆ హాస్య నటులకు సంబంధించి కెమెరా వెనుక మరో జీవితం ఉంది. అదేంటో విశాఖను అడిగితే చెబుతుంది. అర్రె..విశాఖ ఏం చెబుతుందని ఆశ్చర్య పోతున్నారా?
అది సుందర విశాఖ నగరం. మాదవధారలోని ఒక అపార్ట్‌మెంట్. గత కొన్ని రోజులుగా ఆ అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్‌కు తరచూ కొత్త వాళ్ల రాకపోకలు పెరిగాయి. వాళ్లలో అందమైన అమ్మాయిలున్నారు. చూడ చక్కని రూపాలు వారివి. అ అమ్మాయిల చూపుల్లో కవ్వింపు, నడకలో వయ్యారం కొట్టొచ్చినట్టు కనిపించాయి. అపార్ట్‌మెంట్ వాసులకు ఏదో అనుమానం. కొందరు ఆ ప్లాట్‌పై నిఘా వేశారు. అవును, వాళ్ల అనుమానమే నిజమైంది. ఆ ప్లాట్‌లో అమ్మాయిల సౌందర్యంతో వ్యాపారం.
ఈ విషయమై కొందరు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధవధారలోని ఆ అపార్ట్‌మెంట్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా కొందరు పట్టుబడ్డారు. పట్టుబడిన వాళ్లలో ఒక మహిళ, నలుగురు విటులున్నారు. విటుల్లో ఇద్దరు దొరబాబు, పరదేశిగా గుర్తించారు. వీళ్లిద్దరూ జబర్దస్త్ కామెడీ షో నటులుగా గుర్తించారు. ఆ తర్వాత యధావిధిగా పోలీసులు తమదైన రీతిలో విధులు నిర్వర్తించారు.