కూతురిలా చూసుకోవాల్సిన కోడలపై కన్నేశాడు ఆ కీచక మామ. ఇంట్లో ఆమె భర్త లేని సమయం చూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. పలుమార్లు ఆమెను రేప్ చేశాడు. ఎట్టకేలకు వ్యవహారం బయటపడింది. కామాంధుడు కటకటాల పాలయ్యాడు
బొబ్బిలిలోని ప్రసాదనగర్ ఎస్సీ కాలనీలో 20 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది. వాళ్లను చూసేందుకు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు వాళ్ల చినమామ. అయితే అలా వచ్చివెళ్లిన ప్రతిసారి సదరు మహిళపై కన్నేశాడు. ఒకసారి భర్త లేని టైమ్ చూసి ఇంట్లో దూరాడు. మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు.
పాపం తనపై జరిగిన అకృత్యాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయింది ఆ మహిళ. దీంతో మామ మరింత తెగించాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఇల్లాలు ఇక సహించలేకపోయింది. ఎదురింటికి వెళ్లి మొరపెట్టుకుంది. వాళ్లు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఇదంతా తెలుసుకున్న పిల్ల మామ పరారయ్యాడు. పోలీసులు మాత్రం వదల్లేదు. 5 రోజుల పాటు కష్టపడి అతడ్ని పట్టుకొని రిమాండ్ కు తరలించారు.