ఘాజీ సినిమా తరువాత డైరక్టర్ సంకల్ప్ రెడ్డి అందిస్తున్న సినిమా అంతరిక్షం. తెలుగులో తొలి స్పేస్ బేస్డ్ సినిమా ఇది. ఆ మధ్య తమిళంలో తొలి స్పేస్ సినిమా టిక్.. టిక్.. టిక్ వచ్చింది. ఆ విధంగా సౌత్ లో అంతరిక్షం రెండో సినిమా అవుతుంది. మరో మూడువారాల్లో జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా కథ ఇప్పుడు ఇండస్టీ జనాల కబుర్లలో చక్కర్లు కొడుతోంది.
అంతరిక్షం బేస్డ్ గా సంకల్ప్ రెడ్డి ఏం చేయబోతున్నారు, ఏం చూపించబోతున్నారు, అన్నది కాస్త ఆసక్తికరంగా వుండడంతో, జనాలు ఈ సినిమా గురించి తెగ ఆచూకీ తీస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ నాసా సైంటిస్ట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
కొన్ని కారణాల వల్ల ఉద్యోగం వదిలేసిన హీరో, ఒక విపత్కర పరిస్థితిని చక్కదిద్దడానికి మళ్లీ నడుం బిగిస్తాడట. ఈ క్రమంలో ఇండియాకు అంతరిక్షం నుంచి రాబోయే పెను ఆపదను నివారిస్తాడట. వింటుంటే, సంకల్ప్ రెడ్డి కాస్త భారీ సినిమానే తలకెత్తుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పూర్తిగా అంతరిక్షంలోనే కాకుండా, గ్రవుండ్ మీద కూడా కథ సమానంగా నడిచేటట్లు కనిపిస్తోంది.
వరుణ్ తేజ్ సరసన ఇద్దరు హీరోయిన్లు అదితిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. అందువల్ల కేవలం స్పేస్ ఓరియెంటెడ్ మూవీ అనే అనుకోనక్కరలేదేమో? ఇప్పటికి అయితే సినిమా రన్నింగ్ టైమ్ ను 131 నిమిషాలు అంటున్నారు. అంటే ఘాజీ మాదిరిగా చాలా క్రిస్ప్ గా వుంటుందన్నమాట.
చంద్ర 'స్క్వేర్' తెలంగాణ గెలుపు చంద్రుడెవరు? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్