నాని-మైత్రీ సినిమా రెడీ

నాని మరో సినిమాకు ప్రకటన వచ్చేస్తోంది. మైత్రీమూవీస్ పతాకంపై నాని హీరోగా ఒక సినిమా ఎప్పటి నుంచో డ్యూ వుంది. ఇప్పుడు టైమ్ వచ్చింది. విక్రమ్ కుమార్ డైరక్షన్ లో నాని హీరోగా మైత్రీ…

నాని మరో సినిమాకు ప్రకటన వచ్చేస్తోంది. మైత్రీమూవీస్ పతాకంపై నాని హీరోగా ఒక సినిమా ఎప్పటి నుంచో డ్యూ వుంది. ఇప్పుడు టైమ్ వచ్చింది. విక్రమ్ కుమార్ డైరక్షన్ లో నాని హీరోగా మైత్రీ మూవీస్ సినిమాను ఇవ్వాళో రేపో ప్రకటించబోతున్నారు. ఈ మేరకు అన్ని వ్యవహారాలు పూర్తయ్యాయని తెలుస్తోంది.

విక్రమ్ కుమార్ ఓ సినిమాను నానితోనే చేయాలని అనుకున్నారు ముందుగా. కానీ సెట్ కావడం ఆలస్యం అయింది. దాంతో బన్నీ దగ్గరకు వెళ్లారు. అక్కడ కూడా సెట్ కావడం లేటయింది. దాంతో మళ్లీ ఇటు వచ్చారు. ఆఖరికి ఇప్పుడు దాదాపు రెండూసెట్ అయినట్లే. నాని సినిమా ముందుగానూ, బన్నీ సినిమా వెనుకగానూ.

విక్రమ్ కుమార్ దగ్గర అశ్వనీదత్, మంజుల ఘట్టమనేని, గీతా ఇలా చాలా అడ్వాన్స్ లు వున్నాయి. అయితే మైత్రీకీ చేయాల్సి వుంది. పైగా నాని కూడా మైత్రీ వైపే మొగ్గారు. దాంతో మార్గం సుగమం అయింది. ఈ మేరకు అనౌన్స్ మెంట్ ఇవ్వాడానికి ఫొటో షూట్ కూడా చేసారు.

ఓ గోడ మీద నాని-విక్రమ్ కుమార్ కూర్చున్నట్లుగా ఫొటోలు తీసారు. నేడో, రేపో ప్రకటన విత్ ఫొటో బయటకు వస్తుంది.

ఎన్టీఆర్ కు భవిష్యత్ లేకుండా చేసే ప్లాన్… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్