రోబో 2.0 విడుదల మరికొన్ని గంటల్లోకి వచ్చేసింది. అయిదు వందల కోట్లకు పైగా ఖర్చుచేసిన ఇండియన్ సినిమా. అది కూడా సౌత్ సినిమా. శంకర్ సినిమాల మీద ఓ నమ్మకం వుంది. ఆయన మంచి మంచి సినిమాలు అందించారు. అయితే టెక్నాలజీ వెంటబడి ఐ సినిమాను పాడుచేసుకున్నారు. అయినా శంకర్ మీద జనాలకు అపారనమ్మకం వుంది.
రోబో 2.0 సినిమా ట్రయిలర్ లో చెప్పింది చాలా తక్కువ అని, చాలా దాచామని శంకర్ నే చెప్పారు. మరోపక్క ఈ సినిమా సెల్ ఫోన్లు రేడియేషన్లను చర్చించిందని, జనాలను పక్కదారి పట్టించే ప్రమాదం వుంది. టెలికాం కంపెనీలు గోల చేస్తున్నాయి. ఇప్పటి వరకు వదిలిన ప్రోమోషన్ మెటీరియల్ లో కథ ఏమిటి అన్నది ఎక్కడా రివీల్ కాలేదు.
అక్షయ్ కుమార్ రూపంలో ఓ విపత్కర పరిస్థితి, దాన్ని ఎదుర్కోవడానికి రంగంలోకి దిగిన చిట్టి 2.0. అయితే ఆ విపత్కర పరిస్థితి ఏమిటి? దానికి మొబైళ్లకు సంబంధం ఏమిటి? అసలు అక్షయ్ కుమార్ విలన్ నా అని అడిగితే శంకర్ కాదు, అదో ప్రత్యేకమైన ఫోర్స్ అన్నట్లు సమాధానం చెబుతున్నారు. అంటే అక్షయ్ కుమార్ క్యారెక్టర్ ను కూడా ఏదోకాస్త పాజిటివ్ నెస్ వుండేలా తయారుచేసినట్లు అనిపిస్తోంది.
టెలికాం కంపెనీలు వుట్టినే గొడవ చేయవు. అంటే సినిమాలో మొబైళ్ల వాడకం పెరిగిపోవడం వల్ల వచ్చే ప్రమాదం గురించి ఏదో పాయింట్ ను ప్రత్యేకమైన మెసేజ్ గా శంకర్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జనాల్లో మొబైల్ టవర్ ల నుంచి రేడియోషన్ వస్తుందని, దానివల్ల సమస్యలు వస్తాయని పలు అనుమానాలు వున్నాయి.
ఇప్పుడు సినిమా కనుక వాటిని డీల్ చేస్తే ఆ ప్రభావం జనాల మీద కచ్చితంగా వుంటదనే అనుకోవాలి. ఇక తెలుస్తున్న సమాచారాన్ని బట్టి, అక్షయ్ కుమార్ ఆకాశం నుంచి దిగివచ్చే శక్తికాదని, ఈసారి శంకర్ సూపర్ నాచురల్ పవర్స్ గురించి కొంచెం డీల్ చేసాడని, తెలుస్తోంది.
ఇప్పటి వరకు చిన్న పెద్ద అందరు డైరక్టర్లు ఈ సూపర్ నాచురల్ పవర్స్ గురించి డీల్ చేసారు కానీ, శంకర్ లాంటి పెద్ద డైరక్టర్ కాదు. రాజమౌళి కూడా ఈగ సినిమా విషయంలో ఓ ఆత్మ ఈగ మాదిరిగా జన్మించి పగ తీర్చుకునే కాన్సెప్ట్ వుంది. మరి శంకర్ ఏం చేసారో? ఎలా చేసారో చూడాలి.
ఎన్టీఆర్ కు భవిష్యత్ లేకుండా చేసే ప్లాన్… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్