భవ్య హడావుడికి రీజన్ ఏమిటి?

పెద్ద బ్యానర్లు చిన్న సినిమా చేస్తే కాస్త గట్టిగానే పబ్లిసిటీ చేస్తాయి. అయితే భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ విషయంలో మరికాస్త ఎక్కువే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఓ పిట్టకథ అనే చిన్న సినిమాను భవ్య…

పెద్ద బ్యానర్లు చిన్న సినిమా చేస్తే కాస్త గట్టిగానే పబ్లిసిటీ చేస్తాయి. అయితే భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ విషయంలో మరికాస్త ఎక్కువే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఓ పిట్టకథ అనే చిన్న సినిమాను భవ్య సంస్థ టేకప్ చేసింది. కొత్త దర్శకుడు, కొత్త హీరోలు, కొత్త హీరోయిన్, ఈ సినిమాను మాగ్జిమమ్ ప్రమోట్ చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ ను తీసుకురావడం ద్వారా జనాల దృష్టి కాస్త అటు మళ్లేలా చేయగలిగారు.

కేవలం బ్రహ్మాజీ కుమారుడు హీరో అని ఇంత చేస్తున్నారా? లేక ప్రాజెక్టు మీద నమ్మకమా? అన్నది సినిమా విడుదలయితే తప్ప తెలియదు. కొత్త దర్శకుడు చెందు ముద్దు దగ్గర కాస్త విషయం వుందని, అందుకే ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నామని భవ్య వర్గాలు అంటున్నాయి. సినిమా విడుదలయిన తరువాత మరో మంచి దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడని అందరూ అంటారని భవ్య యూనిట్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.

సినిమా పబ్లిసిటీ మెటీరియల్ చూస్తుంటే, ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి తీసినట్లు కనిపిస్తోంది. ఈ మధ్య థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చేస్తున్నాయి. కానీ వాటిన్నింటిలో మోడరన్ టచ్ వున్న లవ్ స్టోరీలు వుంటాయి. కానీ ఓ పిట్టకథలో కాస్త ఇన్నోసెంట్ లవ్ స్టోరీ కనిపిస్తోంది. మరి ఈ జనరేషన్ ను ఇది ఎంత వరకు ఆకట్టుకుంటుంది అన్నది ప్రశ్న. 

ఈ ప్రశ్నకు సమాధానం, భవ్య హడావుడికి రీజన్ సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. హడావుడి ఫలిస్తే ఓపెనింగ్స్ మాత్రమే వస్తాయి. సినిమా బాగుంటే హీరోలు, డైరక్టర్ నిలదొక్కుకుంటారు. వెయిట్ అండ్ సీ.