గీతా గూటికే మళ్లీ బోయపాటి?

ఇదిగో సినిమా ఫినిష్ అంటే అదిగో కొత్త ప్రాజెక్టు అన్నట్లు వుంటుంది కొందరి డైరక్టర్ల వ్యవహారం. వాళ్లకు వున్నక్రేజ్ అలాంటిది. వినయ విధేయ రామ సినిమాను రామ్ చరణ్ తో ఫినిష్ చేసిన తరువాత…

ఇదిగో సినిమా ఫినిష్ అంటే అదిగో కొత్త ప్రాజెక్టు అన్నట్లు వుంటుంది కొందరి డైరక్టర్ల వ్యవహారం. వాళ్లకు వున్నక్రేజ్ అలాంటిది. వినయ విధేయ రామ సినిమాను రామ్ చరణ్ తో ఫినిష్ చేసిన తరువాత దర్శకుడు బోయపాటి చేసే సినిమా హీరో బాలకృష్ణతోనే అన్నది తెలుసు. అయితే ఆ తరువాత ఏంటీ? అన్న దానిపై గ్యాసిప్ లు వినిపించడం మొదలైంది.

ఎప్పడో అఖిల్ తో బోయపాటి అన్న దాన్ని తీసుకువచ్చి, రామ్ చరణ్ ను జోడించి అతుకు వేసి టముకేసే ప్రయత్నం ప్రారంభమైంది. కానీ బోయపాటి క్యాంప్ నుంచి వస్తున్న వార్తలు పూర్తిగా భిన్నంగా వున్నాయి. బాలయ్య సినిమా తరువాత బోయపాటి గీతా క్యాంప్ లో సినిమా చేయాల్సి వుంది. అది పక్కా.

అయితే ఆ సినిమా బన్నీతోనా? చిరంజీవితోనా? అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. గీతా వరకు ఫస్ట్ ప్రయారిటీ మెగాస్టార్ చిరంజీవి-బోయపాటి అన్నది. కానీ కొరటాల శివ సినిమా పూర్తి అయితే కానీ అది సాధ్యంకాదు.

ఇటు బాలకృష్ణ సినిమా, అటు కొరటాల శివ సినిమా కాస్త గ్యాప్ లో ఫినిష్ అయితే మాత్రం బోయపాటి-చిరు సినిమా లేదూ అంటే బన్నీ-బోయపాటి సినిమా. అదీ గీతా ఆలోచన. ఈ ఆలోచనలో అఖిల్ కు ఎక్కడా ప్లేస్ లేదు. అదీ సంగతి.

జనసేనలోకి ఫ్యాక్షన్ నేత..ఎమ్మెల్యేగా బరిలోకి?!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్