ఎన్టీఆర్ బయోపిక్ మార్కెటింగ్ కాస్త భారీగానే సాగుతోంది. థియేటర్ హక్కులు ఇప్పటికే ప్రతిచోటా మంచి రేట్లకు అమ్మేసారు. బాలయ్య సినిమాల్లో ఇదే హయ్యస్ట్ రికార్డుగా నిలుస్తుంది. ఇదిలా వుంటే బయోపిక్ అడియో హక్కులు లహరి సంస్థకు విక్రయించారు. ఈ డీల్ విలువ రెండు కోట్లకు పైగానే అని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ కాలంలో అడియో రైట్స్ కు పెద్దగా రేట్లు పలకడం లేదు. అడియో అమ్మకాలు అన్నవి ఎప్పుడో ఆగిపోయాయి. నిర్మాతకు కావాల్సినన్ని సీడీలు తయారుచేసి ఇచ్చేయడం తప్ప, అమ్మడం అన్నది తగ్గిపోయింది. అయితే ఆన్ లైన్ ఇన్ కమ్ కాస్త బాగుంది. ఆన్ లైన్ అడియో ప్లాట్ ఫారమ్ లకు విడివిడిగా రైట్స్ విక్రయించడం ద్వారా రికవరీ జరుగుతోంది.
అడియో బాగుంటే ఆన్ లైన్ లో కంటెంట్ కు మంచి ఆదరణ లభించి రెవెన్యూ వస్తోంది. ఆ ఆశతోనే ఎన్టీఆర్ బయోపిక్ కు రెండుకోట్లకు పైగా ఇచ్చినట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకుడు కావడం, కీరవాణి సంగీత దర్శకుడు కావడంతో ఆడియో బాగానే వుంటుందనే నమ్మకం వుంది.
జనసేనలోకి ఫ్యాక్షన్ నేత..ఎమ్మెల్యేగా బరిలోకి?!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్