బయోపిక్ లో హన్సిక కూడా..

ఎంతమంది వచ్చినా చోటున్నది లోపల అంటాడు వెనకటికి ఓ కవి. ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారం అలా వుంది. ఎన్నో పాత్రలు వుండడంతో, ఎంతమందికి అయినా అకామిడేషన్ వుంటోంది. నిన్నటికి నిన్న పాయల్ రాజ్ పుత్…

ఎంతమంది వచ్చినా చోటున్నది లోపల అంటాడు వెనకటికి ఓ కవి. ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారం అలా వుంది. ఎన్నో పాత్రలు వుండడంతో, ఎంతమందికి అయినా అకామిడేషన్ వుంటోంది. నిన్నటికి నిన్న పాయల్ రాజ్ పుత్ పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ యాడింగ్ హన్సిక. దేశముదురు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన హన్సిక కు ఈ మధ్య సినిమాలు కాస్త తగ్గాయి. 

ఎన్టీఆర్ బయోపిక్ లో సీనియర్ హీరోయిన్ జయప్రద పాత్రకు హన్సికను తీసుకున్నారు. కలర్, లుక్స్ కు జయప్రద పాత్రకు అన్నివిధాలా సరిపోతాయని అనుకున్నాక, డైరక్టర్ క్రిష్ టెస్ట్ షూట్ చేసినట్లు తెలుస్తోంది.  టెస్ట్ షూట్ సంతృప్తికరంగా వుండడంతో, ఓకె చేసారు.

ఎన్టీఆర్ తో వరుస హిట్ లు ఇచ్చిన హీరోయిన్లలో జయప్రద ఒకరు. యమగోల, అడవిరాముడు, ఇలా చాలా వున్నాయి. అందుకే ఆమె పాత్రకు కూడా బయోపిక్ లో మంచి చోటే దక్కినట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి, ఇందూరి విష్ణుతో కలిసి బాలకృష్ణ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా జనవరి, ఫ్రిబ్రవరిలో తెరమీదకు వస్తుంది.

జనసేనలోకి ఫ్యాక్షన్ నేత..ఎమ్మెల్యేగా బరిలోకి?!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్