యువిలో మళ్లీ శర్వానంద్

శర్వానంద్ కు మంచి హిట్ లు ఇచ్చిన సంస్థగా క్రెడిట్ యువి క్రియేషన్స్ కే దక్కుతుంది. ఆ సంస్థతో శర్వాకు మంచి అనుబంధం కూడా వుంది. బయట బ్యానర్లకు రెండు సినిమాలు చేసిన శర్వా,…

శర్వానంద్ కు మంచి హిట్ లు ఇచ్చిన సంస్థగా క్రెడిట్ యువి క్రియేషన్స్ కే దక్కుతుంది. ఆ సంస్థతో శర్వాకు మంచి అనుబంధం కూడా వుంది. బయట బ్యానర్లకు రెండు సినిమాలు చేసిన శర్వా, ఇప్పుడు మరో సినిమాను యువి బ్యానర్ లో చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

గతంలో కొన్ని సినిమాలకు కో డైరక్టర్ గా పనిచేసిన ఒకరు చెప్పిన లైన్ శర్వాకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. దాన్ని ఇప్పుడు డెవలప్ చేయిస్తున్నారు. అది ఓకె అయితే, ప్రస్తుతం చేస్తున్న, హను రాఘవపూడి, సుధీర్ వర్మల సినిమా తరువాత అదే తెరకెక్కే అవకాశాలు వున్నాయి.

హను రాఘవపూడితో చేస్తున్న సినిమా డిసెంబర్ 21న, సుధీర్ వర్మతో చేస్తున్న సినిమా మార్చి నెలాఖరున విడుదలవుతాయి. ఈ రెండుకాక మరే సినిమా కమిట్ కాలేదు. చందు మొండేటి కూడా ఓ లైన్ చెప్పినట్లు తెలుస్తోంది. దాన్ని పూర్తిగా విని ఓకె చేయాల్సివుంది.

24 పెయిన్స్‌!.. ఈ  24 ముద్దులు.. చదవండి సినిమా రివ్యూ: 24 కిస్సెస్‌