మోడరన్ చంటబ్బాయ్

కొత్తతరం ప్రతిభ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. అక్కడి నుంచి పెద్ద తెరపైకి వస్తోంది. అలా వచ్చిన వారిలో కొందరు షార్ట్ ఫిలిం లెవెల్ నుంచి ఎదగలేకపోతున్నారు. ఎదగగలిగిన వారు పెద్ద దర్శకులు,…

కొత్తతరం ప్రతిభ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. అక్కడి నుంచి పెద్ద తెరపైకి వస్తోంది. అలా వచ్చిన వారిలో కొందరు షార్ట్ ఫిలిం లెవెల్ నుంచి ఎదగలేకపోతున్నారు. ఎదగగలిగిన వారు పెద్ద దర్శకులు, నటులుగా మారుతున్నారు. లేటెస్ట్ గా మరో బ్యాచ్ ఇలా పెద్ద తెరపైకి వస్తోంది.

గతంలో మళ్లీ రావా సినిమాను అందించిన బ్యానర్ పై ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాను అందిస్తున్నారు. ఓ ఫన్నీ డిటెక్టివ్ కమ్ ఇన్ వెస్టిగేటివ్ ఏజెంట్ వ్యవహారం అన్నమాట. అంటే గతంలో వచ్చిన జంధ్యాల-చిరంజీవి కాంబినేషన్ లోని చంటబ్బాయి టైపు. అయితే ఇప్పుడు జనరేషన్, రోజులు మారాయి కాబట్టి, కాస్త మోడరన్ గా కనిపిస్తాడు.

ఈ సినిమా టీజర్ బయటకు వదిలారు. నవీన్ పోలిశెట్టి, శృతివర్మ ప్రధానపాత్రలు, స్వరూప్ దర్శకుడు. టీజర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనీగా వుంది. మార్క్ కే రోబిన్ ఆర్ఆర్ టీజర్ కు ప్లస్ అయింది. టీజర్ లో షార్ట్ ఫిలిం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెయిన్ సినిమా చూస్తే ఎలా వుంటుందో చూడాలి.